2014-12-13

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి : ఈ రాశి కి అధిపతి గురుడు ,ఇది అగ్ని తత్వము కలిగిన రాశి మరియు చరరాశి . ఈ రాశి యందు జన్మించిన వారు పరోపకారము చేయుదురు . అంతా భగవంతుని నిర్ణయము ప్రకారమే జరుగుతుందని , కర్మ ఫలమని నమ్ముతారు . ఆచారములు , సాంప్రదాయము లకు ఎక్కువ విలువనిస్తారు . వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది . ఏక సంధా గ్రాహులు. ఎప్పుడో జరిగిన విషయములను కూడా గుర్తించుకొంటారు. లోకములో అందరూ న్యాయంగా ఉండాలని , న్యాయంగానే బ్రతకాలని అనుకొంటారు .

వీరు ఎక్కువ ఊహా లోకంలో విహరిస్తారు . ఏ దైనా పనిని ప్రారంభించక మునుపే లాభ , నష్టములను గురించి అలోచించి గాలిలో మేడలు కడతారు . వీరికి దైవ భక్తీ అధికము . పురాణాలు , ఇతిహాసాలు మరియు దైవ సంబంధ మైన కధలను బాగా చెప్పగలరు . మత ప్రచార సంస్థలలో బాగా రాణిస్తారు . ఎంత లాభ వచ్చే వ్యవహారమైనా  సరే వీరికి అప నమ్మకము ఏర్పడితే మధ్యలో విడిచి పెట్టేస్తారు . ధార్మిక సంస్థల యందు , దైవ సేవా కార్యక్రమముల యందు ఎక్కువగా పాల్గొంటారు .

వీరికి వయస్సు పెరిగే కొలది బుద్ధి జ్ఞానము పెరుగును . చదవడం అంటే చాలా ఇష్టము . తేజస్సు కలవారు . పదిమందిలో గౌరవమును పొందుతారు . కానీ కుటుంబములో వీరిని అర్ధము చేసుకోరు . వీరికి ధనాపేక్ష ఎక్కువ .మనస్సు లో ఏదీ దాచుకోరు . నిర్మొహమాటంగా మాటలాడుదురు . అనుసరించే స్వభావము ఎక్కువగా ఉంటుంది .వీరికి అప్పచెప్పిన పనిని భాద్యతగా నిర్వహిస్తారు .భవిష్యత్తులో జరిగే ప్రతి పరిణామము భగవంతుని సంకల్పమే అని ‘’ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా   ‘’ అంతా ఆయన అనుగ్రహము వలనే నడుస్తుందని అనుకొంటారు .

ఈ రాశి వారు ఎప్పుడు తృప్తిగా , ఆనందముగా ఉండాలని అనుకొంటారు .జీవిత విషయములో ముందు ప్రణాలికలు ఉండవు . వీరికి స్వతంత్ర నిర్ణయములు ఉండవు . ఏ విషయములో నైనా పరిమితికి మించి ఆలోచిస్తారు . తాత్కాలిక సంగతుల గురించి పట్టించుకోరు . నిత్యము ఏదో ఒక కొత్త విషయమును గురించి తెలుసుకోవలెననే ఆరాటము వీరిలో ఎక్కువ . వీరికి జీవిత భాగస్వామి గానీ మరి ఎవరైనా గానీ మంచి సలహాలను ఇచ్చి ప్రోత్సహించి నట్లయితే జీవితములో చాలా ప్రగతిని సాధించ గలరు . ఆరోగ్య విషయములో తగు జాగ్రత్త అవసరము .జాగ్రత్త వహించనిచో బిపి , షుగర్ లాంటి వ్యాధులు బారిన పడే అవకాశమున్నది .       .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...