2014-12-15

వృశ్చిక రాశి

వృశ్చికరాశి : ఈ రాశి కి అధిపతి కుజుడు ఇది జల తత్వము కల రాశి . ఈ రాశి స్థిర స్వభావము కలది . ఈ రాశిలో జన్మించిన వారికి గర్వము ఎక్కువ . కఠినమైన  మనస్సు కలిగి యుందురు . . వీరు వృశ్చికము వలె పగ ప్రతీకారముల తో ఉంటారు . ఇతరుల వలన అపకారము జరిగిననూ , భాధకలిగిననూ ఏదో విధంగా వారిపై కక్ష తీర్చు కొంటారు . వీరు రహస్యములను బయటకు చెప్పరు.  పొదుపు (Savings ) విషయములో జాగ్రత్త వహింతురు . అన్ని విషయములకు డబ్బే ప్రదానము అనే భావన కలిగి ఉంటారు .

అన్నతమ్ములను (Brothers), తల్లి దండ్రులను (Parents)చివరకు  జేవిత భాగస్వామిని { Life partner } కూడా వీరు నమ్మరు . వీరి ప్రపంచమే ప్రత్యేకము . వీరి మనస్సు అర్ధము చేసుకొనుట కష్టము .తమ ఆరోగ్యము( Health) సౌఖ్యముల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు .
గూడచార సంస్థల యందు . ఇన్వెస్టిగేషన్ సంస్థలలో వీరు బాగా రాణిస్తారు . అసూయ ,ద్వేషములు ఉంటాయి .ఒకరి కింద పనిచేయుట వీరికి ఇష్టం ఉండదు . స్వతంత్రతను కోరుకొంటారు .

ఒకరకంగా చెప్పాలంటే వీరు పిసినారులని చెప్పవచ్చు , కానీ వీరు అనుకొన్నదాని కంటే ఎక్కువ ఖర్చు పెడతారు . ఎవ్వరివలనైనా వీరి మనస్సుకు భాద కలిగితే బయటకు చెప్పరు . కానీ ప్రతీకారము తీర్చుకొనే సమయము వచ్చే వరకు వేచి ఉండి వారికి హాని తల పెడతారు .ఇతరుల గురించి పట్టించుకొనే నైజము తక్కువ . తాము వేసుకున్న ప్రణాలికలు తప్ప ఇతరులు ఏమి చెప్పిననూ వీరు ఆలకించరు.

సాదరంగా ఇతరులకు వీరు సాయ పడరు . తాము తమకోసమే బ్రతకాలని అనుకొంటారు . సమాజమును గురించికానీ , లోక వ్యవహారములను గానీ అంతగా పట్టించుకోరు . వీరు ధైర్యము ఎక్కువగా ఉన్నట్లు కనపడతారు .వ్యక్తిగతంగా చూస్తే మంచి ఆలోచన కలిగిన వారే . కానీ అన్ని వేళలా ఈ విధమైన పద్ధతులు పనికి రావు . వీరు యుక్త వయస్సులో కుటుంబమునకై పాటుపడతారు . నడివయస్సు వచ్చేటప్పటికి వీరిలో స్వార్ధము పెరుగుతుంది .ఎక్కువ శాతం మందితో విరోధములు పెట్టుకొంటారు ., అందువలన కష్ట సమయములలో వీరికి ఎవరూ అండగా ఉండరు ..

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...