2014-12-09

మకర రాశి

మకర రాశి : ఈ రాశికి శనీశ్వరుడు( Saturn) అధిపతి . ఇది భూ తత్వ రాశి మరియు చరరాశి . ఈ రాశిలో జన్మించిన వారికి ధన సంపాదన పై (Money) మక్కువ ఎక్కువ . పట్టిన పట్టు విడవరు . ఎంతటి కష్టముల నైనా ఓర్పుతో భరిస్తారు . కష్టపడే(hard work) మనస్తత్వము ఉంటుంది . స్వంత శక్తిని నమ్ము కొంటారు . జీవితములో అవసరమైన ప్రణాలికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళతారు . కపటము గానీ మాయ చేసి మోసగించడం వంటివి వీరికి తెలియదు . యధార్ధముగా బ్రతుకుతారు .

తమ స్వంత శక్తి సామర్ధ్యములను ఉపయోగించి ఉన్నత స్థితికి చేరుకొంటారు . అధికారులుగా (Officer) చెలామణి అవుతారు . కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని , పెద్ద పేరుగల వారిగా ఉండాలని తాపత్రయ పడతారు . జేవితములో ఒకటి రెండు సార్లు అపజయము కల్గిననూ నిరాశ పడకుండా అనుకొన్నది సాధించగల ఓపిక , సహనము వీరికున్న సహజ లక్షణము . ఎదుటి వారి విషయములలో జోక్యం చేసుకోరు . వీరు ఇతరులకు చాలా నమ్మకస్తులుగా ఉంటారు . 

ధర్మబుద్ధి కలవారు . ఆత్మగౌరవము కలిగి ఉంటారు . వీరికి ఇతరులపై ఆధారపడకుండా బ్రతకాలని ఉంటుంది . విద్యా ( Education ) సంబంధ విషయముల యందు జాగ్రత్త అవసరము . వివాహ విషయములలో (Marriage ) స్వంత అభిప్రాయము మేరకు నడచు కొంటారు , కానీ దంపతుల మధ్య కొంత అన్యోన్యత లోప ముంటుంది . వీరిని అర్ధము చేసుకొనే జీవిత భాగస్వామి ( Life partner )దొరుకితే వీరు చాలా అదృష్టవంతులు ఆగుతారు . 

వీరి ప్రవర్తన ఇంట్లో ఒకలాగా ,బయట మరొక లాగా ఉంటుంది . కుటుంబ సభ్యులతో ( Family members ) సత్సంభంధములు పెంచుకొనుట మంచిది . సాధారణము గా వీరికి పూర్వార్జితము గానీ , పిత్రార్జిత సంబంధ ఆస్తులు గానీ[ Property) కలసి వచ్చే అవకాశములు ఉండవు .స్వార్జిత సంపాదన ఉంటుంది . పిల్లల  అభివృద్ది బాగుంటుంది . జీవిత చరమాంకములో ఇతరులపై ఆధారపడ కూడదని అనుకొంటారు .వీరు నరముల సంబంధ అనారోగ్యముతో భాదపడు సూచనలున్నవి. ఆరోగ్యము పట్ల జాగ్రత్త అవసరము .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...