2017-04-16

వృషభరాశి

వృషభరాశి : ఈ రాశి వారికి ఓర్పు, సహనము ఎక్కువగా ఉండును . వీరు ఏ పని యందైనా నిదానముగా తొందర పడకుండా ఉందురు . శాంతస్వభావము అధికము . జీవితములో ఎన్ని కష్ట, నష్టములు ఎదురైనా భయపడకుండా ఉంటారు . పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడతారు .

వీరికి ఆత్మవిశ్వాసము ఎక్కువ .ఆలస్యమైనా అనుకొన్నది సాధించేవరకు పట్టు విడవరు . ఎంతటి శ్రమనైనా ఓర్చుకొని జీవితములో ముందడుగు వేయుదురు .వీరికి కళల యందు అభిమానము ఉండును . ఎదుటివారిని అర్ధం చేసుకొనుటలో వీరికి వీరే సాటి . వీరు ఎదుటి వారి మనోభావములను అర్ధము చేసుకొని వారికి అనుకూలముగా ప్రవర్తింతురు . ఎవరికీ ఏ అవసరము వచ్చిననూ సాయపడే తత్వము వీరికి ఉండును. జీవితము కొన్ని నియమ నిబంధనలతో  కూడి యుండును .

ఒక విధంగా చెప్పాలంటే వీరు క్రమ శిక్షణ కలవారు . వీరు కుటుంబ యజమాని అయితే పిల్లల పెంపకము విషయములో క్రమ పద్ధతి గా ఉందురు . ఏ విషయమునైనా క్షుణ్ణంగా పరిశీలించిగానీ నిర్ణయము తీసుకోరు . దీర్గ కాల ప్రణాళికతో వీరు ముందుకు వెళతారు . పిల్లలు , కుటుంబము , గృహము , ధనము మొదలగు విషయములలో ప్రత్యేక శ్రద్ధ కనపరచుదురు . ఈ రాశి వారు సాధారణ స్థితి నుండి ఉన్నతస్థాయికి ఎదుగుతారు .

వీరు తాత్కాలిక ప్రయోజనముల గురించి ఆలోచించరు . దీర్గకాలిక ప్రయోజనములతో ప్రణాలికా బద్దంగా ముందుకు వెళతారు . ప్రతి విషయములోనూ ఆచి తూచి స్పందిస్తారు . నమ్మిన సిదాంతమును వదలి పెట్టరు.సూక్షమైన ఆలోచన బుద్ది కలవారు . వ్యాపార రంగములో ఈ రాశి వారు ఎక్కువగా రాణింతురు . ముందుచూపు కలవారు .ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించక తమ అభివృద్ది కొరకు ప్రణాళికలు రచించుకొందురు. జీవితములో ఎదురయ్యే ప్రతి సంఘటననూ తట్టుకొని పరిస్థితులను తమకు అనుకూలముగా మార్చు కొందురు .

ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేస్తారు .వృధా ఖర్చులు చేయరు . సంపాదన అనేక మార్గముల ద్వారా వచ్చును .వీరు ధార్మిక కార్యక్రమముల యందు పాల్గొంటారు . వీరు చేపట్టిన దాతృత్వ కార్య క్రమములు దీర్గ కాలములో కీర్తిని సంపాదించి పెట్టును . సంఘము నందు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకొని హుందాతనము కలిగిన జీవితాన్ని అనుభవిస్తారు . ఇతరుల అభిప్రాయములు , నిర్ణయములపై ఆధారపడరు . వీరు స్వతంత్ర నిర్ణయము కలిగి వ్యవహరింతురు .         

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...