2017-04-16

వివాహ పొంతనవధూవరులకు వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో తీసుకొన్నారు .
1 వర్ణకూటమి  2 వశ్యకూటము ౩ తారాకూటమి 4  యోనికూటము 5 గ్రహకూటమి 6. గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి
వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.
రవి , కుజులు క్షత్రియులు , గురు , శుక్రులు బ్రాహ్మణులు , బుధ, చంద్రులు వైశ్యులు, శని శూద్రుడు, రాహు కేతువులు మ్లేచ్చులు

2 . వశ్యపొంతన : మేషరాశికి - సింహము ,వృశ్చికం, వృషభ రాశివారికి కర్కాటక ,తులారాశులు , మిదునమునకు కన్యరాశి, కర్కాటకరాశికి వృశ్చికం, ధనుస్సు , సింహరాశికి తులారాశి ,  కన్యకు మిధున , మేషములు , తులా రాశికి కన్య, మకరం, వృశ్చికరాశికి కర్కాటకం ,ధనుస్సుకు మీనము , మకర రాశికి మేషం , కుంభం కుంభరాశికి మేషము , మీనమునకు మకరం ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను .

౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము రాకూడదు

4 . యోనిపొంతనము : పులి ఆవు , పిల్లి ఎలుక , లేడి కుక్క , గుఱ్ఱము దున్న , పాము ముంగిస , సింహం ఏనుగు , కోతి- మేక  ఇవి విరోధ జంతువులు ఇంతకు ముందర నక్షత్రములు వివరణ అను శీర్షికలో నక్షత్రములు జంతువులను గూర్చి వివరించితిని . వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి  కాకూడదు . ముఖ్యముగా యోనిపొంతన అవసరము .

5 గ్రహకూటమి : సూర్యుడు శని , చంద్రుడు బుధుడు , కుజుడు బుధుడు .గురుడు శుక్రుడు ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమి ని చూసేటప్పుడు పై విధంగా ఉండ కూడదు.

6 గణ కూటమి : ఇరువురు ఒకే గణమునకు చెందిన వారైతే నిర్భయంగా వివాహము చేయవచ్చును . ఒకరిది దేవగణం , మరియొకరిది రాక్షస గణమైన కొద్ది ఇబ్బండులున్ననూ చేయవచ్చును , రాక్షస మానుష్య గణములు మృత్యుప్రదమని సూచించిరి . కానీ ప్రస్తుత కాలములో గణ పొంతన వలన అంత అపాయములు జరుగుటలేదు . 

7. రాశి పొంతనము : వధూ వరుల ఇరువురి రాశులు పరస్పరం మిత్రత్వము కలిగి ఉండవలెను . స్త్రీ రాశి నుండి పురుష రాశి 7 రాశుల కన్నా ఎంత ఎక్కువ ఉంటె అంట మంచిది . దీనినే స్త్రీ దీర్గ పొంతన అని అందురు . ఇరువురి రాసులలోనూ ద్వి, ద్వా దశము , షష్ఠ , అష్టకములు కాకూడదు . ఇది చాలా చాలా ముఖ్యము , ద్వి ద్వా దశము వలన అంతగా ప్రమాదము జరుగుట లేదు కానీ , షష్ట అష్టక స్థితి వలన చాలామంది , విడాకులు తీసుకోవడమో ,,అనారోగ్యము పొంది జీవితము అంధకారమగుచున్నది . ఒక్కొక్కప్పుడు ప్రాణ నష్టము సంభవించు చున్నది .    

8 నాడీపొంతనము : వధూవరులు ఇద్దరూ వేర్వేరు నాడులకు చెందిన వారై ఉండాలి . ఏక నాడియందు వివాహము చెయ్యరాదు .
ఆద్యే సుత హత: ,అంత్యే ధన హత: మధ్యే వనితా పతి వియోగ :
అని చెప్పబడిన కారణము వలన దంపతులు ఇరువురు ఆది నాడికి చెందిన వారైతే సంతాన నష్టము కలుగునని , అంత్య నాడికి చెందిన వారైతే ధనమునకు ఇబ్బంది ఏర్పడుననీ , మధ్యనాడి చెందిన వారైతే స్త్రీ పురుషుల మధ్య వియోగము ఏర్పడునని , ఎడబాటు కలుగుననీ చెప్పితిరి .
కావున ప్రతి ఒక్కరు వివాహ పొంతనలను చూసుకొని వివాహము జరుపుకొనుట వలన దాంపత్య జీవితము హాయిగా ఉంటుంది .
Post a Comment

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...