2015-02-02

సింహరాశి

సింహరాశి : ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు . ఇది స్థిర రాశి మరియు అగ్ని తత్వము కలది . ఈ రాశిలో జన్మించిన వారు గంభీర వదనము కలిగి యుందురు . వీరికి పట్టుదల ఎక్కువ . అనుకొన్నది సాధించే వరకు నిద్రపోరు .  గర్వము , అహంకారము అధికముగా ఉండును . ఏ సందర్భములోనూ మోసపోయే అవకాశము ఉండదు .. వీరితో విరోధము పెట్టుకొనుట మంచిది కాదు . స్నేహము చేసిన వారిని, నమ్మిన వారిని ఆదుకొనే స్వభావము, దయార్ద్ర హృదయము కలవారు . 

వీరికి కోపం ఎక్కువ . అందరూ తాను చెప్పినట్లు నడచు కోవాలని అనుకొంటారు . ఎవరైనా వీరిని అవమాన పరిస్తే తట్టుకోలేరు . కసి ఎక్కువ , డబ్బును దుబారా గా ఖర్చు చేస్తారు . పొదుపు పాటించరు. పరులకు ఉపకారము చేయుటలో ముందుంటారు . వీరు ఇతరులపై ఆధారపడి బ్రతుకుతారు . కానీ తామే అన్నింటా గొప్ప వారమని గర్వ పడతారు . నిర్మోహమాటంగా మాట్లాడుదురు . గర్వము తగ్గించుకొని ప్రవర్తిస్తే ఈ రాశివారు జీవితములో చాలా ఉన్నత స్థితికి చేరుకోగలరు .  

నాయకత్వ లక్షణము లుండును అధికారులు గానూ , రాజకీయ నాయకులుగానూ చెలామణి అగుదురు .కుటుంబము నందు , సంఘము నందు పెద్ద మనుషులుగా గుర్తింప బడుదురు . ఈ రాశి లో జన్మించిన కొంత మందికి జీవితములో ఏదో ఒక సందర్భములో  పదవీ యోగము కల్గుచున్నది  . వీరు పొగడ్తలకు లొంగి పోవుదురు. రాజసము కలవారు . వీరికి ధన సంపాదన అధికముగా ఉండును .

ఈ రాశి వారికి సాధారణంగా పూర్వీకుల సంపాదించిన వారసత్వపు ఆస్తులు ఉండును . అట్లు లేకున్నా ఏదో ఒక సందర్భములో అనుకోని అదృష్టము కలసి వచ్చి ధనవంతులు అవుతారు . పెద్ద పెద్ద సంస్థల యజమానులు గా రాణిస్తారు . ఎదుటివారి బలహీనతలు తెలుసుకొని తమకు అనుకూలముగా మార్చు కొందురు. సమాజములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు .  .   
బ్లాగు మిత్రులందరికీ నా మనవి . దయచేసి ఈ బ్లాగు పోస్టులను షేర్ చెయ్యండి ..

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...