ఏ విషయము నందైనా ప్రణాలికా బద్దంగా నడచుకోనవలెను అనే సిద్దాంతము
వీరిలో కన్పించుచున్నది . ఇతరులకు ఆదర్సవంతముగా కనపడతారు . అనుకొన్నది సాధించ గలరు
. ఒక్కొక్క సమయములో నిర్దేశించుకున్న లక్ష్యమును చేరుకొను సమయములో వీరికి కొన్ని
ఆటంకములు ఎదురైననూ కొంత శ్రమకోర్చి
విజయమును పొందగలరు .రచనలు చేయుట, వీరికున్న ప్రత్యేక లక్షణము .
లలిత కళలయందు , ఆటలయండు మక్కువ ఎక్కువగా ఉండును . సంగీతము , సాహిత్యము
లన్న వీరికి ఇష్టము . చాల వేగంగా ఆలోచించ గలరు . సూక్ష్మమైన , నిశిత పరిశీలనా
జ్ఞానము కలవారు .ఆపద సమయములలో ఇతరులకు సాయపడుటకు ,ఉపకారము చేయుటకు ముందుంటారు . భార్య
భర్తలమధ్య మంచి ఆప్యాయత , ప్రేమ కలిగి ఉంటారు . అలంకరణ , మంచి వాతావరణము ,అనిన వీరికి ఇష్టము . గృహమును తమకు అన్ని విధముల
సౌఖర్యవంతముగా ఉండేటట్లు తీర్చి దిద్దుకొందురు .
తాము చేసిన తప్పులను పొరపాట్లను గుర్తించక పోవడమే కాకుండా తొందరగా
మరచి పోవుదురు . దీని వలన జరిగిన తప్పులనే మరలా చేయుచుందురు . ఎదుటి వారి
తప్పులనున్ గురించి దెప్పి పొడిచే మనస్తత్వము అధికము . మంచి విమర్శనా జ్ఞానము
కలవారు . ఎప్పుడు నిత్యనూతనంగా ,పరిశుభ్రంగా ఉంటారు .వయస్సు పెరిగిననూ యవ్వనంలో
ఉన్నవారి వలె కన్పిస్తారు . ఇష్టం లేనప్పుడు బంధువుల అవసర సమయములలో కుంటి సాకులు
చెప్పి తప్పించు కొంటారు . ఈ రాశి వారు స్వతంత్రతను కోరుకొంటారు . ఇతరుల పై
ఆధారపడకుండా బ్రతకాలని అనుకొంటారు .
No comments:
Post a Comment