2013-06-16

అన్నప్రాశనము:



అన్నప్రాశనము  మగపిల్లలకు  6 8 10 12 నెలల లోనూ ఆడ పిల్లలకు 7 9 11 నేలలయందు చేయవలెనని జ్యోతిర్విదులు చెప్పితిరి . 10 నెలల లోపు అన్నప్రాసన చేయించుటకు వీలు లేనప్పుడు 11 వ మాసములో గానీ , 12 వ మాసములో గానీ అన్న ప్రాసన చేయించ వలెననీ 2 వ సంవత్సరము కలిసిన తరువాత చేయించ కూడదు . ఇది నియమము మాత్రమే . 

అన్నప్రాసన గురించి చెప్పిన విధానములో మనకు సైంటిఫిక్ మెథడ్ ఉంది . అదేమిటో చూద్దాం .
పిల్లల పుట్టిన ఆరునెలల వరకు పాలు ఇవ్వడం .తరువాత అన్నప్రాసన చేయించడం 

పాలు ద్రవ రూపములో ఉంటాయి . ద్రవ రూపములో ఉన్న పదార్ధములను జీర్ణించుకొనే జీర్ణ వ్యవస్థ తల్లి గర్భములో ఉండగానే మొదలవుతుంది . శిశువు జన్మంచిన నాటినుండి సుమారు ఆరునెలల వరకు జీర్ణ వ్యవస్థ లో అనేక మార్పులు జరుగు తాయి . మెల్లగా ఘన పదార్ధాలను జీర్ణము చేసుకొనే వ్యవస్థ తయారవుతుంది . 

అందువల్లనే ఆరు నెలల తరువాతే అన్న ప్రాసన జరిపించాలి అనే నియమము పెట్టారు . తరువాత 2 వ సంవత్సరములో అన్న ప్రాసన చేయగూడదని చెప్పారు . మరింత ఆలస్యముగా అన్నప్రాసన చేయించుట వలన పిల్లలకు పౌష్టిక ఆహార లోపము ఏర్పడి పిల్లల  ఎదుగుదలలో లోపము ఏర్పడుతుందనే ఉద్దేశ్యముతో చెప్పి ఉండవచ్చు .

శుభగ్రహ రాసుల యందు , శుభగ్రహ లగ్నముల యందు శుభ నక్షత్రముల యందు, శుభ తిధుల యందు ,దశమ స్థానము , అష్టమ స్థానము శుద్ది కలిగి ఉన్నప్పుడు పూర్వాహ్నమునకు ముందు ఈ తంతు జరిపించాలి .          

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...