వీరు రెండు రకముల ప్రవర్తన కలిగి యుందురు . ఒకప్పుడు చాల గంభీరముగానూ
. ఒకొక్కప్పుడు పిరికి వారుగానూ ఉందురు .వీరు చేయు పనుల యందు ప్రణాళిక లోపించును ,
జాగ్రత్త వహించినచో కొంత అభివృద్ది సాధించ గలరు . వీరి జీవితములో రెండు గానీ
అంతకన్నా ఎక్కువ గానీ వృత్తులను చేపట్టగలరు .టెక్నికల్ రంగములలో వీరు అధికముగా
రాణింతురు . ముఖ్యముగా వీరు ఆర్ధిక రంగములలో అనేక రకముల ప్రణాలికలు రచించ గలరు .,
కానీ తమ స్వంత విషయముల యందు సరియైన ఆర్ధిక ప్రణాళికతో వ్యవహరించలేరు . వీరి
జీవితము కొద్ది కాలము కష్ట తరముగా , మరికొద్ది కాలము సుఖముగా గడచును .
జీవిత భాగస్వామి ఆలోచనలతో ముందుకు వెళ్ళుట మంచిది . వీరికి గ్రాహ్య
శక్తి అధికము . మేధావులు, ,నటనా రంగముల యందు విశేష ప్రతిభ కనబరచ గలరు . జీవితములో
కూడా కొంత నటింతురు . ఆత్మీయులకు కూడా నిజం చెప్పరు . కొంత గర్వము కలవారు .
సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు శారీరకంగా కష్టించి పని చేయరు . వీరు తమ ఆలోచనా
శక్తి తో మానసికంగా శ్రమిస్తారు . ఈ రాశివారు రిటైల్ వ్యాపారములో బాగా రాణిస్తారు
.
మిధున రాశిలో జన్మించిన జాతకులకు వాక్చాతుర్యము బాగుంటుంది . అందువలన
పరిస్థితులను బట్టి , సందర్భమును బట్టి మాటలాడుదురు . సమయోచిత నిర్ణయములు
తీసుకోనుటలో సిద్ధహస్తులు . వీరు ఎవరితోనూ విరోధము పెట్టుకొనుటకు చూడరు .ఎలాంటి
వారినైనా తమ మాటల గారడితో నమ్మిస్తారు .వీరిలో కొందరు జ్యోతిష్య శాస్త్రము యందు,
మరియు వాయు సంబంధ పరిశోధనలు గావించగలరు .
వీరికున్న అపూర్వమైన మేధాశక్తి చే కొత్త ,
కొత్త విషయముల పై పరిశోధన చేయ గలరు . ప్రచార (పబ్లిసిటి )రంగములో వీరు బాగా రాణిస్తారు.
వీరి మనస్సు ఎప్పుడు నూతనత్వమును
కోరుకొంటుంది .