8 వ ఇంట కుజుడున్న జాతకులకు ఆయుస్సు బాగుంటుంది . వారసత్వ సంపద వృద్ది
కలుగుతుంది .కానీ కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యముగా ఆస్థి సంబంధ వ్యవహారములలో సమస్యలు
ఎక్కువగా ఉంటాయి .
భాగ్య స్థానమైన ధనుస్సు లో కుజుడు మిత్ర క్షేత్ర స్థితిలో ఉన్నటువంటి
జాతకులకు పితృ భాగ్యము , ఉంటుంది . కానీ జాతకులు యవ్వన సమయములో తండ్రికి కొంత
ఆర్ధికపరమైన నష్టములు, శారీరక సమస్యలు , ఏర్పడతాయి . ఇక్కడ కుజుడున్న జాతకులు
తండ్రికి మించిన తనయులు కాగలరు . విశేష కీర్తిని , పేరును సంపాదించి కుటుంబ
గౌరవమును పెంచెదరు .
పదవ ఇంట మకరరాశి లో కుజుడు ఉచ్ఛ స్థాన గతుడై ఉన్నటువంటి గ్రహ స్థితి
కలిగిన జాతకులు రుచక మహా పురుష యోగమును పొందుతారు . ఈ యోగ ప్రభావముచే జాతకులు సామాన్య
కుటుంబమున జన్మించిన వారైననూ జీవితములో అత్యున్నత స్థానమును పొందగలరు . మంచి జీవన
స్థితి ( ఉద్యోగము , వ్యాపారము , అధికారము ) ఏర్పడును . కానీ మధ్య , మధ్యలో కొన్ని
ఒడుదుడుకులు ఏర్పడతాయి .వీరు స్వయంకృతాపరాధము వలన పౌరుషమునకు పోయి ఎంతటి పనినైనా (
అది డబ్బైనా కావచ్చు లేక ఉద్యోగమైనా కావచ్చు ) మధ్యలో విడచి పెడతారు . .
11 వ స్థానమైన కుంభ రాశిలో కుజుడు స్థితి యుండగా జన్మించిన జాతకులు
భూముల వలన , సోదరుల వలన విశేషముగా లాభ పడుదురు . వీరికి సాధారణముగా బ్రతుకును
గురించి చింత యుండదు . ఎల్లవేళలా ఏదో ఒక వ్యాపకముతో గడుపుతారు . సోదరుల
ప్రోత్సాహముతో ఉన్నత స్థితికి చేరుతారు .భూ సంభంద వ్యవహారములలో బాగా కలసి వస్తుంది
.
12 వ స్థానమైన మీనరాశి లో కుజుడు మిత్ర క్షేత్ర స్థితిని పొంది యుండగా
జన్మించిన వారు దాన ధర్మములు ఎక్కువగా చేయుదురు . వీరు సుఖపడుట తక్కువ . పూర్వీకుల
నుంచి సంక్రమించిన ఆస్థిని పాడు చేయుదురు . జీవితము యొక్క అంతిమ సమయములో కొంత
ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు . ముందు చూపు లేక పోవుట వలన డబ్బును వృధా వ్యయము
గావించుట వలన అనేక కష్ట నష్టములు ఏర్పడును .