2013-07-21

జన్మ నక్షత్రము – జనన దోషములు 10 – 18

10. మఖ నక్షత్ర 1 వ పాదములో జనన మైతే 5 నెలల వరకు తండ్రికి దోషము . మఖ నక్షత్ర ప్ర్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము . ౩ వ పాదము న పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము . అశ్వము దానమిచ్చుట వలన దోషము తొలగును .  2 4 పాదములలో జన్మించిన దోషములేదు.

11. పుబ్బ నక్షత్రములో 1 2 ౩ 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

12. ఉత్తర నక్షత్ర 1 , 4 వ పాదముల లో జననము జరిగిన యెడల తల్లి , తండ్రి , అన్నలకు దోషము కలుగును . నూనె పాత్రను దానము చెయ్యాలి . మిగతా 2 ౩ పాదములలో పుట్టిన వారికి దోషము లేదు .

13 . హస్తా నక్షత్ర ౩ వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి , స్త్రీ వలన తల్లికి దోషము కలుగును . మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు .

14. చిత్త నక్షత్రములో 1 వ పాదము తల్లికి 2 వ పాదము తండ్రికి ౩ వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది . నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును .

15 స్వాతి నక్షత్రమున 1 2 ౩ 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు

16 విశాఖనక్షత్రము జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును . 1 2 ౩ 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము . విశేష శాంతి అవసరము .

17 . అనూరాధ నక్షత్రములో  1 2 ౩ 4 పాదముల లో జన్మించుట వలన దోషము లేదు .


18 . జ్యేష్ట నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము . దీనిలో 1 2 ౩ 4 మొదలగు ఏ పాదములో జన్మించినా దోషమే . జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి . అందు ఏ భాగములో పుడితే ఆ భాగ సంభందము కలవారికి తప్పక నాశనము కలుగును .

1 వ భాగములో  తాతయ్యకు 2 అమ్మమ్మ కు ౩ తల్లి తోడ బుట్టిన వారికి , మేనమామలకు 4 అన్నలకు , అక్కలకు 5 శిశువునకు 6 ఎవ్వరికి దోషము ఉండదు 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు 8 జాతకునకు  9 తల్లికి 10 తండ్రికి దోషము కలుగ చేయును . మరియు నాల్గవ పాదమున జనన మైతే తండ్రికి దోషము . ఇది సమారు 9 నెలలు ఉండును . గోవు ను దానము ఇచ్చుట వలన శాంతి కలుగును . విశేష శాంతి చేయించాలి .    

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...