2013-07-25

జన్మ నక్షత్ర ఫలితము _ భరణి

భరణి నక్షత్రములో పుట్టిన వారు విద్వాంసులు అవుతారు . మంచి ఆరోగ్యము కలవారు . సత్యమును  మాటలాడుదురు . శాస్త్ర విజ్ఞానము కలవారు . తలచిన పనిని ప్రయత్నముతో సాధింతురు . దృడ చిత్తము కలవారు . మిక్కిలి ధైర్య సాహసములు కలిగి ఉంటారు . వేదాంతము , ఆధ్యాత్మిక చింతన కలవారు .

ఊహ తెలిసిన నాటి నుండి లోక వ్యవహారములను ప్తత్యేకించి తెలిసి కొనడము వీరికున్న సహజ లక్షణము . శారీరకము గా అల్ప దేహము కలవారైనా మానసికముగా ధృడముగా ఉంటారు . గాంభీర్యము ప్రదర్శిస్తూ ఉంటారు . సుగుణములు కలవారు . ధనము సంపాదించుటకు పాకులాడు చుందురు. వీరికి కళా హృదయము ఉంటుంది . సుగంధ పరిమళములపై మోజు ఎక్కువ . అందమును ఆస్వాదింతురు .

బలమైన కండరములు , సమమైన ఎత్తు కలిగి చూచుటకు అందముగా కన్పిస్తారు . కొంత స్త్రీ లక్షణము వీరిలో ఉంటుంది . బిడియము , జంకు కలిగి ఉంటారు . మానసికముగా బలంగా ఉంటారు . చిన్న చిన్న సమస్యలకు చలించరు . వీరికి ముందు చూపు ఎక్కువ . శాంత స్వభావము కలవారు . కష్ట పడి పని చేయుట కన్నా తెలివితేటలతో బాగా పైకి రావాలని చూస్తారు . భూ , గృహ సౌఖ్యములు కలవారు .

భరణి వారు ధరణి ఏలునని సామెత ఉన్నది . వీరు ప్రజా సంఘములకు అధిపతు లగుదురు . మంచి విశ్లేషణా జ్ఞానము కలవారు . మంచి వాక్చాతుర్యము కలిగి ఉంటారు . ఎక్కువ ధనము సంపాదించ వలెనను కోరిక కలిగి ఉంటారు . బాల్యము లో విద్యా సంభంద విషయములలో ఆటంకములు ఏర్పడుతాయి .    అధికారుల మన్ననలను పొందుతారు . మంచి గుణము కలిగిన జీవిత భాగాస్వాముని పొందుతారు . దైవ భక్తీ అధికముగా ఉంటుంది .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...