2013-07-25

జన్మనక్షత్ర ఫలితము _ పునర్వసు

పునర్వసు నక్షత్రములో జన్మించిన వారు ధర్మముగా నడచుకొందురు . ఇతరులకు సహాయము చేయుటలో ముందుంటారు . యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము కలవారు . ఎదుటి వారి మనసు తెలుసుకొని ప్రవర్తిస్తారు . ఇతరులను భాద పెట్టరు. ఆచార వ్యవహారములలో ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు . ఏ విషయములోనూ తొందర పడరు . నిదానముగా ఆలోచించి నిర్ణయములు తీసుకొందురు . వీరికి దైవము పట్ల బాగా నమ్మకము ఉంటుంది .

ఈ నక్షత్రమున జన్మించిన వారు చాలా తెలివైన వారు . ఏక సంధాగ్రాహులు . సూక్ష్మ పరిశీలనా శక్తి కలిగి ఉంటారు . ఎంతటి క్లిష్ట సమస్యలనైనా తొందరగా అర్ధము చేసుకొని పరిష్కారము లను సూచించ గల మేధాశక్తి వీరి సొంతము . భయస్తులు , వీరు లేనిదాని కొరకు ఆరాటపడరు . ఉన్నదానితో సంతోష పడతారు . ఒకవిధంగా చెప్పాలి అంటే వీరు అల్ప సంతోషులని అనవచ్చు . ఎక్కువగా చదువుటకు ఇష్ట పడతారు . మత సంభంద విషయముల పట్ల , ఆచార సంప్రదాయముల పట్ల నమ్మకము చాలా ఎక్కువ .

జాలి , దయ ,కరుణ కలవారు . జరిగే దంతా మన మంచికే అను భావము వీరిలో ఉంటుంది . అంతా దైవ నిర్ణయమే అని కర్మఫలితమే అను ప్రగాడమైన నమ్మకము కలవారు . ఇతరులకు సలహాలిచ్చుట ,మార్గ నిర్దేశనము చేయుట, పదిమందికీ ఉపయోగ పడుతుంటారు . లాభ నష్టములను గురించి ఆలోచించరు . వీరి వలన లాభ పడిన వారు విశ్వాసముతో ఉంటే చాలునని అనుకొంటారు .

ఈ నక్షత్రమున పుట్టిన వారు భాధ్యతలను విస్మరిస్తారు . సుమారుగా ౩౦ , 35 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు కూడా కుటుంబ భాధ్యతలను గానీ , జీవితము యొక్క అభివృద్ధిని గానీ పట్టించుకోరు . వీరికి భార్య వలన , గానీ అత్త గారింటి నుండి గానీ సంపద లభించును . వివాహ అనతరము జీవితము అభివృద్ది చెందును . దేవాలయముల యందునూ , ధర్మ కార్యములలోను, ధార్మిక సంస్థలయందునూ అభివృద్ది చేయుదురు ..


ఈ జాతకులు దాతృత్వ కార్యక్రమములలో పాల్గొంటారు . మంచివారు .ఎవరితోనూ విరోధము పెట్టుకోరు . తాత్కాలిక సుఖములకు ఆశించరు. పాప పుణ్యములను విచారించి ముందుకు వెళతారు. దూరాలోచన కలవారు . నడివయస్సు దాటిన తరువాత సమాజములో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు పెరుగును .         

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...