మృగశిరా
నక్షత్రము లో పుట్టిన వారు సౌందర్యముగా ఉంటారు . గౌరవము మర్యాద కలిగి సంఘమునందు
ఉన్నతముగా రాణిస్తారు . వీరు పెద్ద పెద్ద కార్యములను చేపడతారు . దయ, జాలి కలవారు .
కొంత అహంకారము , గర్వము తో ఉంటారు . కుటిల స్వభావము కలవారు . శత్రువులను తనకు
గిట్టని వారిని ఇబ్బందులకు గురి చేస్తారు .మంచి వాక్చాతుర్యము కలిగి ఉంటారు .
పూర్వ ఆచార సాంప్రదాయములను గౌరవించుట , వాటిని పాటించుట వీరికున్న ముఖ్య లక్షణము .
పురాణములను , వేద శాస్త్రములను చదువుట , వాటిగురించి నలుగురకూ చెప్పెదరు .ఆచార
వ్యవహారముల యందు ఇష్టత కలవారు . తమ స్వంత పనులలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు .
తల్లి తండ్రి యెడల విశేష భక్తీ భావము కలవారు . అనుకొన్న పనులను ప్రణాలికా బద్దంగా
నిర్వహించు స్వభావము వీరికి ఉంటుంది . దైవ బలం వీరికి అండగా ఉంటుంది . ఎక్కువగా
ధనము కొరకు ఇబ్బందులు పడతారు . వీరి
చేతిలో ధనము నిల్వ ఉండుట అరుదు .
సాధారణముగా అగ్ని తత్వ నక్షత్రము మరియు కుజుడు
అధిపతి యైన ఈ నక్షతమున జన్మించిన వారికి కోపము ఎక్కువ . తొందరగా ఉద్రేకపడతారు .
తగవులలో ముందుంటారు . ఉద్రేకముగా వ్యవహరించుట వలన కొన్ని సార్లు సమస్యలను
ఎదుర్కొనవలసి ఉంటుంది . క్షణిక ఆవేశమునకు లోనగుదురు . పౌరుషము ఎక్కువ . ఎంతటి
వారితో నైనా ఎదుర్కొంటారు . వెనుకంజ వేయరు .
వీరు జీవితభాగస్వామితో కలసి మెలసి ఉండుట మంచిది .
ఎందుకంటే భార్య భర్తల మధ్య కొంత అవగాహన లోపము ఉంటుంది . ఒకరికి ఒకరు అరమరికలు
లేకుండా ఉండుట వలన అనుకూలత ఏర్పడును . పర స్త్రీ వ్యామోహము కలవారు . సంతాన సంభంద
విషయములో కొంత నష్టము జరుగు అవకాశములు ఉన్నవి . మనసున ఉన్న విషయములను బయటకు చెప్పరు.
గుంభనంగా ఉంటారు . ఆరోగ్య విషయమున జాగ్రత్త అవసరము .
మధ్య వర్తులుగా ఉండడము , ఇతరులకు హామీ ఉండడం
లాంటి వలన సమస్యలు ఎదురగును ., కోర్టు సంభంద విషయములలో ఇరుక్కుంటారు .ద్వేషము
కలవారు . ద్వేషమును తగ్గించు కొనిన అభివృద్ధి బాగుండును . పంతాలు , పట్టింపులు
ఎక్కువ గా ఉంటాయి . కోపము నషాళానికి ఎక్కుతుంది. ఎంత వేగముగా కోప పడతారో అంతే వేగంగా శాంతిస్తారు
. .
No comments:
Post a Comment