ఆరుద్ర నక్షత్రములో జన్మించిన వారు సాధారణముగా
వ్యాపారమును వృత్తిగా ఎంచు కొంటారు . లేకపోతె వ్యాపార సంస్థల యందు ఉద్యోగములో
స్థిర పడతారు . బ్యాంకులు , ఇన్సూరెన్స్ , సేల్స్ మెన్స్ , ఫీల్డ్మెన్స్ మొదలగు
వృత్తులను చేపడతారు . వీరు వ్యాపారము చేయుటలో సమర్ధత , మంచి ప్రావీణ్యత కలవారు .
నేర్పరులై ఉందురు .
ధైర్య సాహసములు ఎక్కువ . సమయాను కూలముగా నడచుకొంటారు . పరిస్థితులను తమకు అనుకూలముగా మార్చుకొందురు . అందరిని కలుపుకొను పోవు స్వభావము వీరికుండును . లోక వ్యవహారములకు అనుగుణముగా నడచుకొంటారు . అందరికి ఆదర్శప్రాయముగా ఉంటారు . బాల్యములో కొంత అనారోగ్యము నకు గురికాగలరు . వీరి నడవడి ప్రత్యేకముగా ఉంటుంది .
ధైర్య సాహసములు ఎక్కువ . సమయాను కూలముగా నడచుకొంటారు . పరిస్థితులను తమకు అనుకూలముగా మార్చుకొందురు . అందరిని కలుపుకొను పోవు స్వభావము వీరికుండును . లోక వ్యవహారములకు అనుగుణముగా నడచుకొంటారు . అందరికి ఆదర్శప్రాయముగా ఉంటారు . బాల్యములో కొంత అనారోగ్యము నకు గురికాగలరు . వీరి నడవడి ప్రత్యేకముగా ఉంటుంది .
వీరు ఆచారములను అంతగా నమ్మరు . కొంత హేతువాదము
ఉంటుంది . కాల క్రమేణా వయస్సు పెరిగే కొలది నమ్మకము , విశ్వాసము పెరుగుతుంది .
దైవభక్తి తక్కువనే చెప్పాలి . జరిగే వన్నీ తమ స్వయంకృషి వలెనే జరుగుతాయనీ వీరి
నమ్మకము . మొండి వారు. మాట పడరు . వీరికి కొంత మోసగుణము ఉంటుంది . పాప భీతి ఉండదు
.
వీరు ఎల్లప్పుడూ ధనము సంపాదించ వలెననే కోరిక
కలవారు . పాప పుణ్యము లను గురించి విచారించారు . తమ స్వంత విషయములను ఇతరులకు
తెలియకుండా జాగ్రత్త పడతారు . తను అనుకొన్న పనులను నేర్పుగా నెరవేర్చు కొంటారు . వీరిక ఓపిక , సహనము ఎక్కువగా ఉంటుంది . దీర్ఘ
కాల ప్రణాళికతో ముందుకు వెళతారు .
భార్య భర్తల అన్యోన్యత బావుంటుంది . కానీ భార్యకు
కూడా నిజము చెప్పరు. అంతా గోప్యముగా ఉంటారు . అన్న తమ్ముల ,, అక్క చెల్లెలు మొదలగు
వారిపట్ల ప్రేమ , అభిమానము ఉన్నట్లు నటిస్తారు . కానీ వారిపై అంతగా అభిమానము ఉండదు
. ధనమే ప్రధానము అను నమ్మకముతో ఉంటారు . వీరి చిన్న తనమున చాలా కష్టములను
ఎదుర్కొంటారు .
నేను గమనించిన విషయము. ఇది అందరికి వర్తించదు . కొంతమంది జాతకులకు తల్లి దండ్రులలో ఎవరో ఒకరికి అనారోగ్యము గానీ
మరణము గానీ సంభవించడము . తద్వారా తల్లి
దండ్రుల ప్రేమను ఆప్యాయత లను కోల్పోయి బాల్యము అంతా కష్టాలతో నిండి ఉంటుంది . ఇది
సుమారు 15 సంవత్సరముల లోపల జరిగే పరిణామము .
No comments:
Post a Comment