2013-08-26

గ్రహములు - జాతులు1



జ్యోతిష్య శాస్త్రములో గ్రహముల ను గురించి వివరిస్తూ గ్రహముల కు జాతులను నిర్ణయించినారు . జాతులు అనగా కులాలు అని తెలుసు కోవలసిన అవసరము ఉన్నది . అయితే కులముల ప్రస్తావన ఏమిటి ? కులములు ఎందుకు ఏర్పడ్డాయి ? . గ్రహముల కు , జాతులకు సంబంధం ఏమిటి . అని చాలా లోతుగా అధ్యయనము చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది .

జ్యోతిష్య శాస్త్రములో సూచించిన జాతులు 5
బ్రాహ్మణులు , క్షత్రియులు , వైశ్యులు , శూద్రులు , మ్లేచ్చులు అని అయిదు రకములుగా విభజించారు.
.
జ్యోతిష్య శాస్త్రము మొత్తం విశ్వం గురించి , ఈ ప్రపంచములో భూమిపై జన్మించిన మానవులందరి గురించి భూత, భవిష్యత్ , వర్తమాన విషయములను తెలుసు కొనుటకు కనుగొన బడినది .

కుల వ్యవస్థ ఉన్న భారత దేశములో ఆనాటి పరిస్థితులను ఉద్దేశించి అలా చెప్పి ఉంటారు . కానీ ఇతర దేశాలలో అనగా కుల వ్యవస్థ లేని దేశాలలో ఉన్నవారికి ఎలా ఫలిత నిర్ధారణ చేయగలము . ఇప్పుడు ఉన్న కులములకు జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడిన కులములకు సంబంధం కుదురుట లేదు .  .

పూర్వకాలములో ముఖ్యముగా మన భారత దేశములో రాజుల పరిపాలన ఉండేది . ఈ భారత దేశములో అనేక చిన్న చిన్న సామంత రాజ్యములను రాజులు పరిపాలించేవారు. పరిపాలకులను క్షత్రియులు గా భావించాలి .

రాజుగారు ప్రభుత్వమును నడుపుటకు సలహాలు సూచనలు ఇవ్వడము , క్లిష్ట సమయములలో సరియైన నిర్ణయములు చేయడం , రాజ్యములో సిద్దాంతములను , రాచరికపు వ్యవస్థలను కాపాడే వారిని , కొత్త కొత్త పరిశోధనలు చేసి మానవ అభివృద్దికి తోడ్పాటు నందించే  మేధావులను బ్రాహ్మణులు గా భావించాలి.

ప్రజలకు కావలసిన వస్తు సామగ్రిని , సరఫరా చేస్తూ వ్యాపారము, వర్తక వాణిజ్యము చేయు వారిని వైశ్యులుగా భావించాలి .

శారీరక శ్రమ కోర్చి ,కష్ట పడే కష్ట జీవులను శూద్రులుగా భావించవలసి ఉంటుంది .
ఇక సంఘ వ్రతిరేక కార్యకలాపము లకు పాల్పడడం , ప్రజా వ్యతిరేక విధానములో ఉన్నవారిని మ్లేచ్చ జాతికి చెందినవారిగా గుర్తించాలి . అంతేగానీ ఇప్పుడుమన ఆచారములో ఉన్న బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర , మ్లేచ్చ జాతులు కాదు అని మనమందరము తెలుసుకోవాలి .

ఎందుకంటే ఇప్పుడు ప్రపంచము లోనే అగ్రరాజ్యము అమెరికాను పరిపాలిస్తున్న  బరాక్ ఒబామా క్షతియుడు కాదు కదా. భారత దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు క్షత్రియుడు కాదు కదా . ప్రపంచములో ఉన్న దేశ అధినేతలలో ఎందరు క్షత్రియులు ఉన్నారు ?.

షేర్ మార్కెట్ మాంత్రికుడు గా పేరు గాంచిన వారెన్ బఫెట్ , రాకేశ్ జంజిన్వాలా లాంటి అపర చాణుక్యులు, వ్యాపార సామ్రాజ్యాలకు అధిపతులు అయిన బిల్ గేట్స్ , ధీరూభాయ్ అంబానీ , ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీ , ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి , విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ వంటి వ్యాపార దిగ్గజాలలో ఎంతమంది వైశ్యజాతి వారున్నారు .

దీనిని బట్టి మనము ఏమని గ్రహించాలి . గ్రహముల కు చెప్పబడిన జాతులు లక్షణములు తెలుసుకొనుటకే గానీ ఇప్పుడున్న కులములకు సంబంధించినవి కావని గ్రహించాలి . 

ఈనాడు రాజరికపు వ్యవస్థలు పోయాయి .. ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చాయి .
వ్యవస్థలు మారవచ్చు . కులాలు మారవచ్చు . కానీ గ్రహాలు శాశ్వతం , భూమి, ఆకాశము శాశ్వతం . పంచ భూతములు శాశ్వతం . అందువలన మహర్షులు చెప్పిన ఏ విషయము అసత్యము కాదు . శాస్త్రములను శోధించి, మదించి మానవాళి అభివృద్ధి కొరకు మానవ పురోగతి కొరకు ఎన్నో పరిశోధనలను చేయాల్సిన అవసరం ఉంది .    

మరింత వివరణ తదుపరి శీర్షికలో .....................

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...