జ్యోతిష్య శాస్త్రములో గ్రహములను గురించి తెలిపిన
జాతులను గురించి ఇంతకు ముందు తెలుసుకొన్నాం .
అయితే ఏ ఏ గ్రహములు ఏ జాతికి చెందినవి . ఆయా
గ్రహముల స్వభావము , లక్షణములు మానవ జీవితము పై ఎలాంటి ప్రభావము చూపిస్తాయి అను
విషయములను గురించి కొంత తెలుసు కొందాం .
సూర్యుడు , కుజుడు క్షత్రియలు
చంద్రుడు , బుధుడు , వైశ్యలు
గురుడు , శుక్రుడు బ్రాహ్మణులు
శనిగ్రహము శూద్రజాతికి చెందినది .
రాహువు , కేతువు మ్లేచ్చ జాతికి చెందినవారుగా
మనకు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు తెలియ చేసారు .
సాధారణముగా ఎవరైనా తమ గురించి తాము తెలుసుకోవాలని
అనుకొన్నప్పుడు నా రాశి ఫలితము ఎలావుంది .
నా నక్షత్ర ఫలితము బావుందా అని అడుగుతూ ఉంటారు .
రాశి , నక్షత్రముల ఆధారముగా ఫలితమును తెలుసుకోవడం
వలన మంచి ఫలితములను రాబట్ట లేము .
మానవుడు జన్మించిన జన్మ లగ్నమును అప్పుడున్న గ్రహములు
ఉన్న స్థితులను ఆధారముగా ఫలితములను తెలుసు కోవడమే ఉత్తమ మార్గము.
ఈనాడు మానవుడు బ్రహ్మాండము నుండి అతి సూక్ష్మమైన పరమాణువు
వరకు పరిశోధన చేయు శక్తి, సామర్ధ్యములను , తెలివి తేటలను తన సొంతం చేసుకొన్నాడు . కానీ
ఎందుచేతనో ఏమో గానీ జ్యోతిష్య శాస్త్రము పరిశోధనల విషయములో నిరాదరణకు గురియైనదని
చెప్పక తప్పదు .
ఈ సమయములో మహర్షులు మనకు అందించిన జ్యోతిష్య
శాస్త్ర సూత్రములను ఉపయోగించి పరిశోధన చేస్తే మానవ జీవితము పై గ్రహముల ప్రభావము వలన
కలుగు అన్ని విషయములను సూక్షముగా తెలుసుకోగలము.
ఇక పైన తెలిపిన విషయములను గురించి చర్చించుకొందాం
.
జాతకము లో బలీయమైన గ్రహము సూర్యుడు అయితే
క్షత్రియ లక్షణములు కలిగి ఉంటారు . ఇట్టి వారు ప్రభుత్వములో పదవులను పొందుతారు .
రాజకీయ నాయకులు కాగలరు. సూర్యుడు యొక్క బలమును అనుసరించి విలేజ్ ప్రెసిడెంట్ నుండి
ప్రధాన మంత్రి వరకు పదవులు పొంది అధ్యక్షులుగా వ్యవహరించగలరు .
జాతకము లో సూర్యుడు బలము ఆధారము గా వచ్చే పదవులు వార్డ్
మెంబరు నుండి రాష్టపతి వరకు ఎలాంటి పదవులైన నిర్వహించగల సమర్ధత మానవుడు పుట్టిన
సమయములో ఉన్న గ్రహముల స్థితుల ఆధారముగా మాత్రమే తెలియును .,
ఏ ఒక్క గ్రహము బలమునో ఆధారముగా చేసుకొని నిర్ణయము
చేయలేము .
రాజ్యాధికారము పొందే విషయములో సూర్యుడు తో కలసి
ఉన్న గ్రహముల ను కూడా పరిశీలించాలి. కర్మ స్థానమును , ఆ స్థానము లో ఉన్న గ్రహములు
, ఆస్థానమును చూస్తున్న గ్రహములు జాతక చక్రములో సూర్యుడు , 10 వ స్థానమునకు ఉన్న
సంబంధము ఇలా అనేక విషయములను పరిశీలించాలి .
అదే విధముగా నడుస్తున్న గ్రహముల దశలను కూడా
పరిగణన లో తీసుకోవాలి .
సూర్యుడు బలముగా ఉండి చంద్రునితో కలసి ఉంటే నీటి
పారుదల సంఘములకు అధిపతులు గానూ, జల వనరుల శాఖ మంత్రులుగా రాణిస్తారు .పాడి పరిశ్రమ
, వాటర్ ట్రిబ్యునల్స్ , రిజర్వాయర్స్ , ఫిషరింగ్ డిపార్టమెంట్లు మొదలగు వాటిలో
పదవులను పొందగలరు . ఇక్కడ చంద్రుడు నీరు , పాలు సంబంధిత శాఖలకు ఆధిపత్యము
వహించుననీ తెలుసుకోవలసి ఉంటుంది .
సూర్యుడు , కుజుడు సంబంధము లో ఉంటే వ్యవసాయ శాఖలలో
, గృహ నిర్మాణ శాఖలలోనూ ,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ , పోలీస్ , మిలటరీ , ఆర్మీ ,
పోర్స్ సంభందిత శాఖల లోనూ , రక్షణ శాఖా సంబందిత శాఖలలోనూ పదవులను పొందుతారు .
అధికారిక హోదా అయిననూ కుజుడు బలహీనము అయితే
సెక్యురిటీ గార్డ్ , గన్మెన్ సంబంధిత ఉద్యోగాలను పొందుతారు . కుజుడు బలవతుడు అయితే
పైన తెలిపిన శాఖలలో గొప్ప అధికారములను పొందు పదవులను చేపడతారు .
తదుపరి భాగములో
....................................,
No comments:
Post a Comment