2013-08-01

జన్మ నక్షత్ర ఫలితము _ మఖ

మఖ నక్షత్రమున జన్మించినవారు మంచి ఆచార సంప్రదాయములను కలిగి ఉంటారు . చురుకుదనము కలవారు . మంచి విద్యావంతులు అగుదురు . తీక్షణ దృష్టి కలవారు . ఆలోచనా పరులు . వీరికి దైవభక్తి , పాపభీతి ఎక్కువగా ఉంటుంది . ఉపకారము చేయు స్వభావము మెండుగా ఉంటుంది . విశ్వాశ పరులు . కులమున లేక తన కుతుంబమున శ్రేష్టులగుదురు .

వీరికి కొంత ఆర్భాటము చేయు లక్షణము ఉంటుంది . పొగడ్తలకు లొంగి పోతారు . విమర్శలను ఇష్టపడరు . ఎవరైనా విమర్శించినచో తట్టుకోలేరు . చాలా వరకు తగవులకు దూరంగా ఉంటారు .వీరు నివాసము చేయు గృహవాతావరణము ఆహ్లాదకరముగా ఉండేటట్లు తీర్చిదిద్దుకొంటారు . భగవంతుని నమ్మడమే కాకుండా నిత్యము స్మరించెదరు. విద్యా వినయములు కలిగిన వారు .

వీరికి భార్యా సౌఖ్యము కొంత తక్కువనే చెప్పాలి . కొంత అన్యోన్యత లోపించును . సంతానము వృద్ధి లోనికి వస్తుంది . సాధారణముగా పుత్ర సంతతి అధికముగా ఉండును. వీరి నక్షత్ర రీత్యా మంచి ప్రయోజకులైన సంతానము కలుగుతుంది .రాజ లక్షణములు ఉంటాయి . శౌర్య పరాక్రమములు కలవారు .

ఈ నక్షత్ర జాతకులు మొండి ధైర్యము కలవారు. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోరు . సమస్యలు ఏర్పడినా గానీ చలించరు. పరిస్థితులకు ఎదురు నిలబడి పరిష్కారము చేసుకొంటారు . మనో బలము ఎక్కువగా ఉంటుంది . ఏ వృత్తినైనా చేయుటకు సిద్ధ పడతారు . తమ స్థాయికి  మించి పరుగెడతారు . తమ శక్తి సామర్ద్యములను మించిన పనులను చేపట్టుట , ప్రణాలికలు వేసుకోవడం లాంటివి చేయుదురు .

పరిస్థితులకు అనుగుణముగా ఇమిడి పోతారు . సాహసము చేయుదురు . కష్ట పడుటకు ఇష్ట పడతారు . సమాజమున గౌరవ మర్యాదలను పొందుతారు . సంగీతాది విద్యలలో ప్రవేశము ఉంటుంది .        

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...