పుబ్బ నక్షత్రమున జన్మించిన వారు అలంకారములన్న
ఇష్టము కలిగి యుందురు . సినిమాలు , సాహిత్యము రచనా , నాటక రంగములలో బాగా
రాణిస్తారు . వీరి జన్మ నక్షత్ర అధిపతి శుక్రగ్రహము . అందు వలన సంగీతాది విద్యలలో
ప్రవేశము ఉంటుంది . సంప్రదాయములను పాటిస్తారు . దూర దృష్టి కలవారు . ముందు వెనుకలు
ఆలోచించకుండా ఏ పనీ చెయ్యరు . ధనవంతులు, చేసిన మేలును , ఇతరుల వలన కలిగిన
ఉపకారమును మరచి పోతారు .
స్వార్ధముఎక్కువ. అవకాశవాదులు . తనకు హాని
జరిగితే పగబట్టి మరీ కక్ష తీర్చుకొంటారు . స్త్రీ సౌఖ్యమునకై అల్లాడుచుందురు.
ఇతరులకు సహాయ పడరు . ప్రతి పనిలోనూ లాభము కలుగ వలెననీ అనుకొంటారు. బుద్ది ,విచక్షణ
జ్ఞానమును , తెలివి తేటలను ఉపయోగించి బ్రతుకుతారు . శారీరకముగా కష్టపడుటకు ఇష్ట పడరు
. కొన్ని అవలక్షణములు ఉన్నా దానగుణము కలవారు . దైవముపై నమ్మకము ఉంటుంది . కానీ
చెప్పే మాటలకు , చేసే పనులకు సంభందము ఉండదు .
నీతి వాక్యాలను వల్లిస్తారు . మనసు విప్పి మాట్లాడరు.
లోపల ఉన్న విషయమొకటి పైకి మాట్లాడేది మరొకటి గా ఉంటుంది . ధనమే ముఖ్యము అను
మనస్తత్వముతో ఉంటారు . వాహన సౌఖ్యములు పొందుతారు . గృహ నిర్మానాది యోగములు కలవారు
. సుగంధ ద్రవ్యములు , ఫల పుష్పములు మొదలగు వాటిపై మక్కువ ఎక్కువ .
ఏ విషయమైనా కావచ్చు గానీ ఒకటికి పదిసార్లు
లేక్కవేసుకొని లాభ నష్టములను విచారించి ముందుకు వెళతారు .భక్తీ , ముక్తి మొదలగు విషయముల గురుంచి అనర్గలముగా
మాటలాడుటలో నేర్పరులు . శారీరక సౌందర్యము కలవారు . ఎప్పుడు నూతన వస్తువులను
ఇష్టపడతారు . పాత వస్తువులను , పాత పద్దతులను ఇష్టపడరు . ఎంత సేపు వీరు తమ
సౌఖ్యమున కొరకే పాటు పడతారు .
తొందరగా ఆకర్షితులు కాగలరు . పేకాట , త్రాగుడు ,
అక్రమ సంభంధములు మొదలగు వ్యసనములకు బానిసలు కాగలరు . జాగ్రత్త వహించినచో జీవితమున
అన్ని విధములుగా అభివృద్ది సాధించ గలరు .
No comments:
Post a Comment