భావములు – విశ్లేషణ
కుజదోషము ను గురించి తెలుసుకొనుటకు కొంత ప్రాధమిక అవగాహన అవసరం కనుక ఈ
విషయములను ఈ శీర్షికలో వ్రాయడం జరిగింది
జాతక చక్రము ప్రకారము మానవుని జీవన విశేషములు తెలుసుకొనుటకు 12
భావములుగా విభజించితిరి .
సూర్య రేఖ భూమిపై ఎక్కడ స్పర్శించు చున్నదో అక్కడ సూర్యోదయము కలుగు
చున్నదని ఇంతకు ముందు శీర్షికలలో తెలుసు
కొన్నాము . లగ్న సాధన గురించి కూడా తెలుసుకొన్నాం .
మానవుని జన్మ సమయమును బట్టి లగ్న నిర్ణయము జరుగుతుంది . తల్లి గర్భము
నుండి శిశు జననము జరిగిన సమయములో ఈ సృష్టి తో అనుబంధం ఏర్పడుతుంది . కాబట్టి జన్మ సమయమును బట్టి ,జన్మ స్థానమును బట్టి
ఖచ్చితముగా లగ్న సాధన చేయవలెను. ఈ లగ్న స్థానము మొదలుకొని 12 రాశులు 12 భావములు గా
ఏర్పడుచున్నవి . 12 భావములు నుండి ఈ దిగువ విషయములను తెలుసు కోవచ్చు.
1 వ భావము నుండి శారీరక ధృడత్వం , ఆరోగ్య విషయములను
2 వ భావము నుండి నేత్రములు , వాక్కు , ధనము , కుటుంబము ను గురించి
౩ వ భావము నుండి అన్న తమ్ములు , అక్క చెల్లెలు , సాహసము , ఉదార గుణము
మొదలగు విషయములు
4 వ భావము నుండి విద్య , వాహనములు , తల్లి , భూమి , గృహము నకు సంబందించినవి
5 వ భావము నుండి సంతానము , బుద్ధిని గురించి
6 వ భావము నుండి శత్రువులు , అప్పులు , అనారోగ్యము ను గురించి
7 వ భావము నుండి జీవిత భాగస్వామిని గురించి
8 వ భావము నుండి ఆయుస్సు , వారసత్వపు ఆస్తులు మున్నగు వాటిని
9 వ భావము నుండి తండ్రి ,భాగ్యము , ధర్మబుద్ది ,దాతృత్వము ,
పిత్రార్జితము నకు సంబంధించిన ఆస్తులు
10 వ భావము నుండి జాతకుడు చేయు వృత్తిని , ఉద్యోగము , వ్యాపారము
మున్నగు వాటి గురించి
11 వ భావము నుండి జాతకుని జీవితములో కలుగు అన్ని రకముల లాభములు
12 వ భావము నుండి జరుగు నష్టములు గురించి తెలుకోవచ్చు.
ఈ విధముగా మానవుని జీవితమును 12 భాగములుగా విభజించి ఫలిత నిర్ధారణ చేయవచ్చునని
జ్యోతిర్విదులు చెప్పి యున్నారు. పైన చెప్పిన విషయములే కాకుండా 12 భావముల నుండి
ఇంకా అనేక విషయములను తెలుసు కోవచ్చునని చెప్పితిరి . .వీటిని గురించి తర్వాత
శీర్షికలలో చెప్పెదను ..
No comments:
Post a Comment