2013-08-17

తారాబలం - ఫలితాలు

 తారాబలం - ఫలితాలు
అన్ని ముహూర్తములకు తారాబలము చూచుట ప్రధానము .
ఎవరికైనా ముహూర్తము చూసేటప్పుడు ఆ వ్యక్తీ యొక్క జన్మ లేక నామ నక్షత్రము నుండి ముహూర్తము నిర్ణయించ వలసిన రోజున ఉన్న నక్షత్రము వరకు లెక్కించ వలెను . అట్లు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగించాలి .  వచ్చిన శేషమును బట్టి తారాబలము తెలుసు కోవచ్చు .  2 , 4 , 6 , 8 , 9 తారలు శుభప్రదం .

మధు అను వ్యక్తి జన్మ నక్షత్రము మఖ అవుతుంది . ఇతనికి రోహిణి నక్షత్రము లో ముహూర్తము ఉన్నదనుకొందాం .
ఇతని తారాబలం మఖ నుండి రోహిణి  22 వ నక్షత్రము అగును  దీనిని 9చే భాగించ గా 4 శేషము . ఇది క్షేమతార    
ఈ తారా బలము  9 రకములుగా ఉంటుంది . అవి

 1 జన్మ తార 2 సంపత్తార ౩ . విపత్తార   4 . క్షేమతార 5 . ప్రత్యక్తార  6 . సాధన తార 7 . నైధన తార 8 . మిత్ర తార 9 . పరమ మైత్రతార అను 9 రకముల ఫలితములు ఉన్నవి .
1. జన్మతార దేహ నాశనమును ( శారీరక శ్రమను సూచించును .) 2. సంపత్తార సంపదను కలుగ చేస్తుంది . ౩. విపత్తార కలహమును కల్గించును 4 . క్షేమతార క్షేమాన్ని కలుగ చేయును 5 . ప్రత్యక్తార కార్య నాశనమును 6 . సాధన తార మంచి ఫలితము నిచ్చును . 7 . నైధన తార కష్టములను కలిగిస్తుంది ( మరణాన్ని గానీ మరణ సంబంధ ఫలితము ఇచ్చును . 8 . మిత్రతార అనుకూల ఫలితము ఇస్తుంది . 9. పరమ మిత్రతార శుభాన్ని కల్గిస్తుంది .

‘’ఈ స్పీడు యుగములో అందరూ ఉద్యోగ , వ్యాపార ,పరమైన వాటిలో చాలా బిజీ గా ఉంటున్నారు . అలాంటి సందర్భములో  వీలు కుదిరి నపుడు లేక శలవు దొరికి నపుడు ముఖ్యమైన కొన్ని ప్రోగ్రాములు పెట్టుకోవలసి వస్తుంది . మరి అలాంటి సమయములో ముహూర్తము కుదరక పొతే తారబలము సరిపడక పొతే ఎలా ?’’

తప్పనిసరై చేయవలసిన  పనులకు ప్రత్యామ్నాయములు ఉన్నాయి .
ఎదైనా పని అర్జంటుగా ప్రారంభిచవలసినపుడు తారాబలము సరిపడక పొతే దానికి కొంత శాంతి విధానమును హిందూ ధర్మములో సూచించారు . జన్మతార కు ఆకు కూరలు , విపత్తరకు బెల్లమును ,  ప్రత్యక్తారకు ఉప్పు , నైధన తారకు నువ్వుల నూనె తో బంగారము ను దానము చేయవలె నని చెప్పితిరి .

కానీ నైధన తార సర్వ ముహూర్తముల యందు విడిచి పెట్టవలెను దీనివలన ఎక్కువ నష్టము కలుగును .
  
  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...