2013-08-21

శాస్త్రములు - అవహేళన

గ్రహముల యొక్క చలనమును బట్టి కాలము ను తెలుసుకుంటున్నాము .

సూర్యుడు చలనము ఆధారముగా రోజు ను తెలుసు కోవడము జరుగుతుంది .
వాస్తవానికి సూర్యుడు అక్కడే ఉన్నాడు . భూమి చలనమును బట్టి రోజును తెలుసు కొంటున్నాము . కానీ జ్యోతిష్య శాస్త్రము ప్రకారము సూర్యుడు కూడా మిగతా గ్రహముల వలె తన కక్ష్యలో తిరుగుచు ఉన్నాడని  జ్యోతిష్య శాస్త్ర వేత్తలు చెప్పియున్నారు . ఇది సామాన్యులకు అర్ధమవ్వాలని అలా చెప్పి ఉంటారు .

ఏవో చిన్న చిన్న సమస్యలను , విషయములను పట్టుకొని అసలు జ్యోతిష్యము మూఢ నమ్మకము అని చాలా మంది వాదించు చున్నారు . అంతే కాదు ఎప్పటినుండో ఉన్నటువంటి ఈ శాస్త్రమును అవమానించు చున్నారు.. ఈ శాస్త్రము సమాజ శ్రేయస్సు కొరకు కనిపెట్ట బడినది అని గమనించ మనవి . చాలా మంది ఉన్నది లేనట్లు , లేనిది ఉన్నట్లు చెప్పుచూ వ్యాపార ధోరణి లో  ప్రజలను మోసము చేయుచున్నారనీ కూడా ప్రచారము చేయుచున్నారు . కొంతమంది అలాంటి వారు ఉంటే ఉండవచ్చు .అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రమును అవమానించుట న్యాయమా ?  

వైద్య శాస్త్రమును అవమానించుట నా ఉద్దేశ్యము కాదు .  

ఒక చిన్న ఉదాహరణ .ఈనాటి వైద్య శాస్త్రములో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి . వైద్య శాస్త్రము ఎంతో అభివృద్ది చెందినది . గుండె తీసి గుండెను పెట్టుచున్నారు . కన్ను తీసి కన్ను పెట్టుచున్నారు . శరీరములో ఏ అవయమునైనా మార్పిడి చేయు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము సాధించినారు .

కానీ పది రూపాయల మందుతో పోయే సామాన్య నీరసమునకు కూడా వందలు , వేలు ఖర్చు చేయిస్తూ ఉన్నారు . వందలు , వేలు తో నయమయ్యే జబ్బుకు కూడా రోగిని భయపెట్టి లక్షలు ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు .
ఇలా జరిగే విషయములను తీసుకొని వైద్య శాస్త్రమును అవమానించ గలమా ?  ఇది వైద్య శాస్త్రము తప్పా ?  

పూర్వము గ్రామాలలో సంచీ వైద్యులు ఉండేవారు .నాడి చూసి జబ్బును పోల్చేవారు .  ఈనాటి మానవుడు ఎంత అభివృద్ది సాధించినా సరే యంత్రముల సహాయము లేనిదే ఏ పనీ జరుగుట లేదు .ఈ విషయము ను విజ్ఞులు గమనించ వలసి ఉన్నది .

ఇక రెండవ విషయము ఈనాడు సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులోకి వచ్చిన తరువాత మనిషి తాను చూసినదే నిజమనీ మిగతాది అంతా అబద్దమము అనీ వాదించు చున్నాడు .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...