2013-08-24

నామకరణము

పిల్లలు జన్మించిన తరువాత నామకరణము ( పేరు పెట్టుట) చేయుటకు 11 వ రోజునగానీ 21 వ రోజున గానీ చేయవలెను.  బారసాల { ఉయ్యాలలో వేసిన రోజు } చేసిన రోజున కూడా చేయవచ్చును . అట్లు కాని యెడల నెల లోపు బేసి రోజులలో గానీ ౩వ  నెల యందు గానీ లేక ఏదైనా బేసి నెలయందు గానీ ఉదయ సమయము నందు అనగా మధ్యాహ్నమునకు ముందు సమయములో మాత్రమె చేయవలెను .

మగ పిల్లలకు సరి సంఖ్యలు గల పేర్లను , ఆడ పిల్లలకు బేసి సంఖ్యలు గల పేర్లను పెట్టుట ప్రశస్తము . చవితీ , నవమీ , పూర్ణిమ , అమావాస్య , తిధులు , మంగళ , శని వారములను విడిచి పెట్టి మిగతా శుభ గ్రహ వారములైన సోమ , బుధ , గురు , శుక్ర వారముల యందు ఈ తంతు జరిపించాలి . 

అశ్విని , రోహిణి ,పునర్వసు , పుష్యమి ,ఉత్తర , ఉత్తరాషాడ , ఉత్తరాభాద్ర ,హస్త , స్వాతి , అనూరాధ , శ్రవణం , ధనిష్ఠ , శతభిష నక్షత్రములో జరిపించుట మంచిది . ముఖ్యముగా 9 వ స్థానము శుద్ధిగా ఉండాలి. తొమ్మిదవ స్థానము శుభ ప్రదంగా శుద్ది కలిగి ఉండగా నామకరణము చేయుటవలన వారు అనేక విధములుగా  కీర్తిని , పేరు ప్రఖ్యాతలు పొందుతారు .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...