2013-09-15

వైడూర్యము (turquoise), cat eye stone

మోక్ష కారకుడు కేతు గ్రహ ప్రతి రూపమే వైడూర్యము
వైడూర్యము పిల్లి కన్ను వలే ఉంటుంది . అందుకే దీనిని పిల్లి కన్ను రాయి అని కూడా అంటారు . ఈ రత్నము నకు మధ్య లో సన్నని దారము వలే  గీత లా కనపడును . ఇటువంటి వైడూర్యము ప్రశస్త మైనది . ఇట్టి రత్నము అరుదుగా లభించును . వైడూర్యము లలో కృష్ణ వైడూర్యము, నీల వైడూర్యము అను 2 రకము లున్నవి . నీల వైడూర్యములను స్త్రీలు ఆభరణం లలో ధరించుట మంచిది .

ఆకు పచ్చ , ఎరుపు , తెలుపు రంగులలో వైడూర్యము లభించు చున్నది . పద్మము వంటి రంగు కలిగినది ఉత్తమ రత్నము . పగుళ్ళు , బీటలు లేనటువంటి రత్నమును ధరించుట వలన విష భాధలు , కష్ట నష్టములు ఏర్పడును. నల్లనిది , కాంతి విహీనముగా ఉన్న దానిని దరించ రాదు .  వైడూర్యము ను ధరించుట వలన ఆధ్యాత్మిక చింతన కలుగును . చర్మ సంభంద వ్యాధులు నశించును . ఎంతటి ప్రత్యర్ధులైనా మిత్రులుగా మారుడురు . ధర్మ బుద్ధిని కలిగించును .

సంఖ్యా శాస్త్ర రీత్యా కేతువు 7 వ సంఖ్యకు అధిపతి
7, 16 , 25
తేదీలలో జన్మించిన వారు , అశ్విని , మఖ , మూల నక్షత్రము లలో పుట్టిన వారు వైడూర్యము ను ధరించవచ్చు .   

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...