2013-09-15

ధనిష్ఠ నక్షత్ర ఫలితము


ధనిష్ఠ నక్షత్రములో పుట్టిన వారు కార్య శూరత్వము కలిగి ఉంటారు , చురుకైన వారు .తలచిన కార్యములను సాధించే వరకు పట్టు విడవరు. మనో బలము ఎక్కువ . ధైర్య సాహసములు  కలవారు . మంచి ఆలోచనా జ్ఞానము కలవారు. సమస్యలపై తొందరగా స్పందించగలరు . వివేక వంతులు . వీరికి నాయకత్వ లక్షణములు ఉండును .  ఈ నక్షత్రము అగ్నితత్వ స్వభావము నకు చెందినది . అందువలన ఈ నక్షత్రమున జన్మించిన వారు ,చాలా తీక్షణత కలిగి ఉందురు . కోపిష్టులు . 

ఈ నక్షత్రము అగ్నితత్వ స్వభావము నకు చెందినది . అందువలన ఈ నక్షత్రమున జన్మించిన వారు ,చాలా తీక్షణత కలిగి ఉందురు . కోపిష్టులు . గట్టి కండరములు కలవారు . శారీరక దృఢత్వము కలిగి ఉంటారు . ఎరుపు రంగు శరీర వర్ణము కలిగినవారు . చూపులో తీక్షణ కలిగి ఉందురు . హుందాతనముగా ప్రవర్తింతురు . ఇతరులకు ఆదర్శ ప్రాయులై ఉంటారు .

వీరు మంచి విద్యావంతులు . తెలివితేటలు కలిగిన వారు .ఉన్నతాశయములు కలవారు. కొంత ఉద్రేక స్వభావము కలవారు . పగ ప్రతీకారములతో రగిలి పోతారు . ఇతరులకు హాని తలపెట్టరు . కానీ ఇతరువలన వీరికి చెడు జరుగుతుందని భావిస్తే మాత్రం వారిని వదిలి పెట్టరు. సంఘసేవ చేయుదురు . దాతృత్వ లక్షణములు ఉంటాయి . వీరి శరీరము ఉష్ణ తీవ్రత కలిగి ఉండును .

వీరు బాల్యమున అల్లరి ఎక్కువగా ఉంటుంది . వయస్సు పెరిగిన కొలది శాంత స్వభావము అలవడుతుంది . ఎంతటి సమస్యలనైనా తట్టుకొని ధైర్యముగా జీవితమున ముందడుగు వేస్తారు . సమస్యలకు ఎదురొడ్డి నిలబడతారు . లక్ష్య సాధన కొరకు పోరాడతారు . భూమి సంబంధ విషయములలో  అన్ని విధాల లాభ పడతారు. చర , స్థిరాస్తులను కలిగి ఉంటారు . తల్లిపై అనురాగము ఎక్కువ . కుటుంబ సభ్యులలో పెద్దరికము వహించగలరు .

జీవిత భాగస్వామిని అర్ధం చేసుకోవడములో పొరబడు చుందురు . మొండిగా వ్యవహరిస్తారు . ఇతరుల సమస్యలను పట్టించు కోకుండా తాను చెప్పినదే అందరూ వినాలనే అహంకార పూరితముగా వ్యవహరిస్తారు . అందుచేత కొన్ని సందర్భాలలో సమస్యలను కొని తెచ్చుకొంటారు.  పిల్లల పట్ల శ్రద్ధ తక్కువనే చెప్పాలి . అనుకూలమైన జీవిత భాగస్వామి లభించక పొతే దాంపత్య జీవితము సమస్యల వలయముగా మారుతుంది .

పొగడ్తలకు లొంగి పోవుదురు. వీరితో విరోధము పెట్టుకొని ఎవ్వరూ గెలవలేరు . ఇతరులలో ఉన్న బలహీనతను తనకు అనుకూలముగా మార్చుకొంటారు . అదను కోసం ఎదురు చూస్తారు .సమయము వచ్చినపుడు దెబ్బ కొడతారు . కర్కశ మనస్తత్వము కలిగిన వారిగా కనిపిస్తారు .కానీ నమ్మిన వారికి విధేయులై ఉంటారు .   


మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...