2013-09-14

పగడం . (coral)

శక్తి స్వరూపుడు ,యుద్ధ కారకు డైన కుజుడు యొక్క స్వరూపమే పగడం .
ఇది సముద్ర తీరముల యందు , దీవుల లోనూ లభ్యమగు చున్నది . దొండ పండు రంగు వలె ఎర్రగా ఉండును.
పుచ్చు లేని పగడం ను ధరించుట ఉత్తమము .పగడం ను ధరించుట వలన శత్రు నాశనము , కోర్టు తగాదాలలో విజయము లభించును.  వ్యాపార నష్టములు నివారింప బడును .

పగడం ధరించుట వలన జాతకము నందున్న కుజ దోష ప్రభావముచే కలుగు కష్ట నష్టములు తొలగును .
{ శరీరము లో రక్తము పై కుజుని ప్రభావము ఉండును.} రక్త శుద్ది కలిగి మంచి ఆరోగ్యము చేకూరును . అప్పుల భాదల నుండి విముక్తి లభించును. ధైర్య సాహసము లు పెరిగి ఉత్సాహము గా ఏ విషయము నందైనా ముందుండే స్వభావము ఏర్పడును .

సంఖ్యా శాస్త్రములో కుజుడు సంఖ్య 9
9. 18 , 27, తేదీలలో పుట్టిన వారు , మృగశిర , చిత్త , ధనిష్ఠ  నక్షత్రము లలో జన్మించిన వారు. మేషరాశి , వృశ్చిక రాశి లలో పుట్టిన వారు పగడం దరించ వచ్చును.

నవ రత్నము ల గురించి ఇంకా అనేక విధములుగా మహర్షులు  చెప్పియున్నారు.  

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...