2013-09-13

శ్రవణం నక్షత్ర ఫలితము

శ్రవణం నక్షత్రములో పుట్టిన వారు సౌమ్యులు , శాంత స్వభావము కలిగి ఉంటారు . వీరు తొందర పాటు నిర్ణయములు తీసుకొందురు . మనో ధైర్యము తక్కువ . సందేహ ప్రాణులు . చిన్న చిన్న విషయములకే ఎక్కువగా భాధ పడతారు . లోకములో ఉన్న కష్టములు అన్నీ తమకే వస్తున్నట్లుగా మదన పడతారు . ఏ విషయమును తొందరగా మరచి పోరు .
వీరు బాల్యమున అనేక కష్టములను ఎదుర్కొంటారు .

చిన్న తనమున పేదరికమును అనుభవించు సూచన లున్నవి . ఈ నక్షత్ర జాతకులకు రాహు మహాదశా కాలములో అనగా సుమారు 12 నుండి 27 సంవత్సరముల వయస్సు మధ్య జీవితము గతుకుల రోడ్డుపై ప్రయాణము చేసినట్టుగా ఉంటుంది . అంటే ఎన్నో కష్ట నష్టముల ను ఎదుర్కొన వలసి వస్తుంది . కుటుంబములో తల్లిదండ్రులకు ఆర్ధిక పరమైన చిక్కులు కలుగును . విద్యకు ఆటంకములు కలుగును . చదువు ముందుకు సాగదు . ఎంతో కష్ట పడితే గానీ అనుకొన్న లక్ష్యములను సాధించ లేరు .

ఈ నక్షత్రములో జన్మించిన వారికి అదృష్టము తక్కువనే చెప్పాలి . వివాహ అనంతరము భాగ్యము కలుగుతుంది . సమాజమున గౌరవ మర్యాదలు లభిస్తాయి . ఉన్నత స్థాయికి చేరు కొందురు . వీరు శారీరక దుర్భలత్వము కలిగి ఉందురు . ఆరోగ్యమును కాపాడు కొనుట మంచిది . వీరికి శరీరములో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది . చిన్న చిన్న రోగములు వచ్చినా తట్టు కోలేరు.

వీరు భూమి , గృహములకు అధిపతులు అవుతారు . సంతాన భాగ్యము కలుగుతుంది . కానీ మొదటి సంతానము ఆడపిల్ల పుట్టే అవకాశములు ఎక్కువ . ధనము విషయములో , కుటుంబ వ్యవహారములలో , పిల్లల అభివృద్ది కొరకు చేసే ఆలోచనలో జీవిత భాగస్వామి సహాయ సహకారములు తీసుకోవడం మంచిది . స్వంత నిర్ణయములు చేయడం మంచిది కాదు .  

వీరికి గురుమహాదశా కాలములో అనగా సుమారు 27 నుండి 45 సంవత్సరముల మధ్య ఆచార సంప్రదాయముల పట్ల నమ్మకము కలుగుతుంది . గౌరవ ప్రదమైన జీవితమును గడుపుతారు . ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది . దైవముపై నమ్మకము కలుగుతుంది . శాస్త్ర విజ్ఞానము అలవడుతుంది . ధర్మ బద్దంగా నడచు కుంటారు . బృహస్పతి అనుగ్రహము వలన వీరి జీవితము పేరు ప్రఖ్యాతలు కలిగి ఆర్ధికముగా స్థిరత్వము కలుగుతుంది .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...