2013-09-10

ఉత్తరాషాడ నక్షత్ర ఫలితము

ఉత్తరాషాడ నక్షత్రములో పుట్టిన వారు నిదానముగా ఆలోచిస్తారు . దీర్ఘముగా ఆలోచించి మంచి చెడులను విచారించి నిర్ణయములు తీసుకొంటారు . చదువులో వెనుకబాటు తనము ఉండును తొందరగా అవగతము చేసుకోలేరు, కొంత చంచల స్వభావము ఉంటుంది . ప్రతి విషయము పట్ల సందేహించు చుందురు . వీరికి ఏకాగ్రత అవసరము . జీవిత భాగస్వామిని ఎంచుకొనుటలో వీరికంటూ స్వంత నిర్ణయము ఉండదు. స్నేహితులు లేక కుటుంబ సభ్యులలో ఎవరైనా వీరికి మార్గదర్శకులు కాగలరు .

ఉద్యోగము మొదలగు అతి ముఖ్యమైన విషయములలో  సులభంగా విజయము సాధించ లేరు . శ్రమానంతరము విజయము కలుగును . వీరు ఇతరులతో ముభావముగా ఉంటారు . కొత్త వారితో లేక కొత్త ప్రాంతములలో తొందరగా ఇమడలేరు . వీరికి ఎక్కువగా నెగెటివ్ థింకింగ్ ఉంటుంది . పాజిటివ్ థింకింగ్ చేయడం మంచిది . లేని యెడల జీవితమున ముందుకు సాగలేరు. అనుకొన్న లక్ష్యములను చేరలేరు . మృదువుగా మాటలాడుదురు .

సాధారణముగా వీరికి భయము ఎక్కువగా ఉంటుంది . సాహసము తక్కువ . వయసు పెరిగే కొలది వీరిలో మానసిక పరివర్తన కలుగుతుంది . జీవిత భాగస్వామి పట్ల మమకారము ఎక్కువగా ఉంటుంది . కుటుంబ శ్రేయస్సు కొరకు ఎక్కువగా పాటు పడతారు . సంతాన వృద్ధి కలుగుతుంది . బంధువులు పట్ల పెద్దగా ఆదరణ చూపరు . వీరి జీవతము సుమారు ౩౦సంవత్సరముల వరకు ఒకలాగా తదుపరి మరొకలాగ సాగుతుంది .

వీరి ఆలోచనలు మంచివే గానీ ఇతరులకు నచ్చవు. వీరు దీర్ఘకాలములో మంచి ఫలితములు కలిగేలా ప్రణాలికలు రచిస్తారు . కానీ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు . ప్రతి పని తన ఆలోచనలకు అనుగుణముగా జరగాలని కోరుకుంటారు . కానీ అలా జరగదు . పొదుపును పాటిస్తారు . భూమి గృహ యోగములను పొందుతారు . ఈ నక్షత్రములో జన్మించినవారు కొంత హోదా కలిగిన పదవులను పొందగలరు . పెద్ద మనుషులుగా రాణింతురు . కుటుంబములో గానీ , సంఘములలో గానీ పెద్దరికము వహింతురు .

భక్తి భావము ఉంటుంది . సంప్రదాయములను పాటిస్తారు . నడివయస్సు దాటేటప్పటికి మనో నిబ్బరము , హుందాతనము అలవడుతుంది . పరిస్థితులకు అనుగుణముగా ఆలోచించడం మొదలు పెడతారు . నూతన వస్తువుల పట్ల ఇష్టత కలిగి ఉంటారు . నమ్మిన సిద్దాన్తమునకు , ఇచిన మాటకు కట్టుబడి ఉంటారు . అన్యాయమును , అక్రమాలను సహించలేరు . కొంత ముక్కు సూటిగా వ్యవహరించు స్వభావము వీరికి ఉంటుంది. 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...