2013-09-07

వినాయక వ్రతకల్పము



వినాయక వ్రత విధానము కొరకు ఈ దిగువ లింకును క్లిక్ చెయ్యండి .డౌన్లోడ్ చేసుకోండి 
వినాయక వ్రతకల్పము కావలసిన వారు ఈ దిగువ లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు .
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః


వినాయక వ్రతము పూజా సామాగ్రి

మట్టి వినాయక విగ్రహం , పసుపు , కుంకుమ , అక్షతలు , గంట , ఆచమన పాత్రలు 2 , ఉద్ధరిణిలు 2 , అగరబత్తీ పేకెట్ , కర్పూరం పేకెట్ , కొబ్బరికాయలు , అరటిపండ్లు , తమలపాకులు , వక్కలు , పళ్ళాలు 2 , దీపారాధనకు వస్తువులు , జంధ్యాలు 2 , పంచామృతం , పీటలు .

నైవేద్యము : ఉండ్రాళ్ళు , అప్పాలు , పరమాన్నం , కుడుములు అటుకులు, బెల్లం , నానుబ్రోలు , చలిమిడి , సీతాఫలం పండ్లు , చెరకు గడలు , మొక్క జొన్న పొట్టలు ,

పువ్వులు మరియు పత్రులు : నాలుగు లేక ఐదు రకముల పండ్లు , చామంతి , గన్నేరు , తంగేడు, తెల్ల జిల్లేడు  మొదలగు పువ్వులు మామిడి కొమ్మలు , మామిడి ఆకులు , మారేడు , నేరేడు , జమ్మి ,జిల్లేడు , గరిక , తంగేడు , మొదలగు పత్రులు  ఇవన్నీ సిద్దం చేసుకోవాలి .

పూజ చేయవలసిన విధి
వినాయక చవితి రోజు వేకువ జామున లేచి కుటుంబ సభ్యులందరూ తలంటుస్నానం చేయాలి . ఇల్లంతా శుభ్రం చేయాలి . పైన తెలిపిన పూజా సామగ్రి సిద్దం చేసుకోవాలి . మీ గృహములో పూజగదిలో గానీ పూజ గది లేనివారు ఈశాన్య దిశలో గానీ స్థలాన్ని శుద్దిచేయాలి . బియ్యపు పిండి , ముగ్గు పిండితో లేక రంగులతో ముగ్గు వేయాలి .

పిమ్మట గణపతిని ప్రతిష్టించుట కొరకు ఒక పీటను సిద్దంచేయాలి . ఆ పీటకు పసుపురాసి , కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గు వేయాలి . ఆ పీటపై ముందుగా సిద్దం చేసుకొన్న గణపతి విగ్రహాన్ని ఉంచాలి .తరువాత కుంటుంబ సభ్యులందరూ బొట్టు పెట్టు కోవాలి .

పూజ చేసేవారు కూర్చునేందుకు మరొక పీటను సిద్దం చేసుకోవాలి . పీటపై తెల్లని వస్త్రమును పరచి అక్షతలు వేయాలి. తాంబూలం కుడి చేతితో పట్టుకొని ఈ విధంగా చదువుతూ పీటపై కూర్చోవాలి .

 శ్లోకం :  శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
          ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే .

పీటపై కూర్చున్న తరువాత మొదటగా తమల పాకును తీసుకొని గణపతి దగ్గర ఉంచాలి . కొంచెం పసుపు పొడిని తీసుకొని నీటితో తడిపి పసుపు గణపతి గా చేయాలి . కుంకుమ బొట్లు పెట్టి తమల పాకు పై ఉంచాలి .

ప్రార్ధన
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమ కేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్ప కర్ణో , హేరంబః స్కంద పూర్వజ:

ఆచమనం 
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా , ఓం మాధవాయ స్వాహా ( అని మూడు సార్లు తమల పాకుతో గానీ మామిడి ఆకుతో గానీ చేతిలో నీరువేసుకొని త్రాగాలి . తరువాత చేతిని శుభ్రం చేసుకోవాలి )

ఓం గోవిందాయ నమః  ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరానమః ఓం హృషికేశాయ నమః  ఓం పద్మనాభాయ నమః ఓం దామోధరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓంవాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః .

 దీపం వెలిగించి పువ్వులు అక్షతలు వేసి నమస్కారం చెయ్యాలి.  ఇంతకు ముందు మనం సిద్దం చేసుకొన్న పూజా సామాగ్రి తో గణపతి ని పూజించాలి .

దీపారాధన
ఈ దిగువ మంత్రాలు చదువుతూ పూలు , అక్షతలు గణపతి పై వేయాలి .
ఓం లక్ష్మి నారాభ్యాం నమః ఓం ఉమా మహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః ఓం శచీ పురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః ఓం సీతారామాభ్యాం నమః ఓం సర్వేభ్యోం మహా జనేభ్యోం నమోనమః .

ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
సంకల్పం

 ప్రాణాయామం చేసి దేశ కాలములను స్మరించి సంకల్పం చేయాలి . .
శుభ తిడౌ శోభన ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే  { ఆయా దేశాలను బట్టి ఈ పదం
మారుతుంది} అస్మిన్ వర్ధమాన వ్యవహారిక చాంద్రమాననేన విజయ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష  ఋతౌ బాద్రపద మాసే శుక్ల పక్షే చతుర్ద్యాం తిధౌ సౌమ్య వాసర యుక్తాయాం  స్వాతీ నక్షత్రే శుభ నక్షత్ర  శుభ యోగ శుభ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిదౌ  శ్రీమాన్ ...............  గోత్రః ...........................................నామధేయః శ్రీమతః ..................... గోత్రస్య ..............................నామదేయస్యః  పూజ చేసేవారు , భార్యా పిల్లలు కుటుంబ సభ్యులు అందరి పేర్లు గోత్ర నామములతో సహా చెప్పాలి . ధర్మ పత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య
 విజయ ఆయు రారోగ్య ఐశ్వర్యాభివృధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్యర్ధం , ఇష్ట  కామ్యార్ధ సిధ్యర్ధం , మనో వాంఛా ఫల సిధ్యర్ధం , సమస్త దురితోప శాంత్యర్ధం , సమస్త మంగళా వ్యాప్త్యర్ధం , వర్షే వర్షే ప్రయుక్త శ్రీ సిద్ది వినాయక ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావశ్చక్తి ధ్యానా వాహనాది షోడచాపచార  పూజాం కరిష్యే .
 
 ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తర్ధ్యం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే
 తదంగ కలశారాధానం కరిష్యే
ఇప్పుడు కలశానికి గంధం కుంకుమ లతో బొట్టు పెట్టాలి . కలశంలో గంధం పువ్వులు , అక్షతలు వేయాలి .
 కలశస్య ముఖే విష్ణు కంటేరుద్ర  సమాశ్రితః
 మూలో తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాః స్మృతాః
కుక్షౌతు సాగరాః సర్వ్ సప్త ద్వీపా వసుంధరా
రుగ్వేదోధ యజుర్వేదః సామవేదోహ్యదర్వణః
 అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః
     
ఈ దిగువ శ్లోకమును భారత దేశములో ఉన్నవారు మాత్రమే చదవాలి . మిగతా వారు ఆఖరి లైను
 చదివితే చాలు.  
  గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ
నర్మదే సిందు కావేరి జలేస్మిన్ సంనిధం కురు
 కలశోదకేన పూజా ద్రవ్యాణి చైవ
 తమల పాకుతో కలశము లోని నీటిని పూజా ద్రవ్యముల మీద , దేవుడి మీదా , తమ మీదా చల్లు కోవాలి .
 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
 ప్రాణ ప్రతిష్ట ముహూర్త సుముహోర్తస్తు  (అని అక్షతలు వేయాలి . )
 స్తిరోభవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు  అని అక్షతలు వేసి నమస్కారం
 చేయాలి .పువ్వులు దోసిలి లోకి తీసుకొని ఈ మంత్రమును చదివిన తరువాత దేవుడి పై వేయాలి .
గణానాంత్వా గణపతిగం  హవామహే , కవిం కవీనా ముపమా శ్రవసప్తమం
 జ్యేష్ట రాజం బ్రహ్మణం బ్రాహ్మణస్పత ఆనశ్ర్యుణ్వన్నూతిభిస్సీద సాదనం
ఆవాహయామి ఆసనం సమర్పయామి .
నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
పాదయో పాద్యం సమర్పయామి .. హస్తయో అర్ఘ్యం సమర్పయామి
ముఖే శుద్దాచామ నీయం సమర్పయామి . ఉపచారిక స్నానం సమర్పయామి .
 అని కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళను కొద్దిగా గణపతి మీద చల్లాలి .
 శ్రీ మహా గణాధిపతయే నమః స్నానం సమర్పయామి
స్నానాంతర శుద్దాచమనీయం సమర్పయామి
 శ్రీ మహా గణాధిపతయే వస్త్రం సమర్పయామి
 శ్రీ మహా గణాధిపతయే యజ్ఞోపవీతం సమర్పయామి   
 శ్రీ మహా గణాధిపతయే శ్రీ గంధాన్ ధారయామి
శ్రీ మహా గణాధిపతయే పుష్పై పూజ యామి
శ్రీ మహా గణాధిపతయే నానా విధ పరిమళ పాత్ర పుష్ప అక్షతాన్  సమర్పయామి
 శ్రీ మహా గణాధిపతయే ధూప మాఘ్రపయామి
 పైన తెలిపిన మంత్రముల వలె గంధం , పువ్వులు , పత్రిలు మొదలగు వాటితో పూజించాలి , ధూప
దీపములనుగణపతికి సమర్పించాలి .
        
శ్రీ మహా గణాధిపతయే దీపం దర్శ యామి దీపమును చూపించాలి .
 దీప దూపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి .
 నైవేద్యం
ఓం భూర్భువస్సువః తత్సత్ వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్వం త్వర్తెన పరిషించామి  అని నైవేద్యము చుట్తో నీళ్ళు తిప్పాలి .
అమృత మస్తు పసుపు గణపతి దగ్గర నీళ్ళు వదలాలి .
అమృతోప స్తరణమసి ..    అని నైవేద్యం పైన నీళ్ళు చల్లి
శ్రీ మహా గణాధిపతయే నమః  నారికేళ సహిత కదలీ ఫల సహిత గుదోపహారం నివేదయామి  అంటూ
స్వామీ వారికి నైవేద్యమును సమర్పించాలి .
ఓం ప్రానాయ  స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా  ఓం ఉదానాయ స్వాహా ఓం
సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ నీళ్ళు వదలాలి .
అమృతాపిథానమసి..  ఉత్తరా పోషణం సమరయామి హస్తౌ ప్రక్షాళ యామి ..  పాదౌ ప్రక్షాళ యామి .. ముఖే శుద్దాచమనీయం సమర్పయామి . అంటూ నీళ్ళు చల్లాలి .

శ్రీ మహా గణాధిపతయే .   తాంబూలం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే .   నీరాజనం సమర్పయామి  
( హారతి ఇచ్చి కళ్ళకు అడ్డుకోవాలి )

తత్పురుషాయ విద్మహే వక్ర తున్దాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్
శ్రీ మహా గణాధిపతయే .  మంత్ర పుష్పం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే .  ఛత్రం ఆచ్చాద యామి
చామరం వీచయామి  .. నృత్యం దర్శయామి గీతం శ్రావ యామి వాద్యం ఘోష యామి ఆశ్వానారోహ యామి గజానారోహ యామి శకటా నారోహ యామి ఆన్దోలికా నారోహయామి  అని అక్షతలు చల్లాలి .


శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః
ప్రాణ ప్రతిష్ష్టపన ముహూర్త స్సుముహోర్తస్స్తు  అని మట్టి గణపతి పై అక్షతలు వేయాలి .
స్వామిన్ సర్వ జగన్నాధ యావత్పూజావ సానకం తాపత్వం ప్రీతి భావనే బిమ్బెస్మిన్
సన్నిధిం కురుమ్  స్తిరోభవ వరదో భవ ప్రసీద ప్రసీద  అని అక్షతలు పూలు వేసి నమస్కారం చెయ్యాలి .

శ్లోకం :  భవసంచిత పపౌఘ విధ్వంసన విచక్షణం
విఘ్నాంధకార భాస్వంతం విఘ్న రాజ మహం భజే
శ్లోకం :  ఏక దంతం శూర్పకర్ణం గజ వక్త్రం చతుర్భుజం
పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్ స్సిద్ది వినాయకం
శ్లోకం :   ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం
             భక్తాభీష్ట ప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకం

షోడశోపచార పూజ :
శ్లోకం : ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిభం ,
 చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం
శ్రీ గణాదిపతియే నమః ధ్యాయామి  ధ్యానం సమర్పయామి

శ్లోకం అత్రాగచ్చ జగద్వంద్య సుర రాజార్చి తేశ్వర
అనాధ నాద సర్వజ్ఞా గౌరీ గర్భ సముద్బవః
ఓం సిద్ది వినాయక స్వామీ నె నమః  ఆవాహయామి

శ్లోకం : మౌక్తికై పుష్ప రాగైశ్చ నానా రత్నైర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః  ఆసనం సమర్పయామి

శ్లోకం : గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియ నందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్ష తైర్యుతం
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః  అర్ఘ్యం సమర్పయామి
తమలపాకు తో స్వామి పై నీళ్ళు చల్లాలి .

శ్లోకం : గజ వక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విర దానన
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః  పాద్యం సమర్పయామి .
తమలపాకు తో స్వామి పై నీళ్ళు చల్లాలి

శ్లోకం : అనాధనాద సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత
గృహాణాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః  ఆచమనీయం సమర్పయామి
తమలపాకు తో స్వామి పై నీళ్ళు చల్లాలి

శ్లోకం : దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గృహానేదం గజవక్త్ర నమోస్తుతే
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః   మధుపర్కం సమర్పయామి
తమలపాకు తో స్వామి పై పంచామృతం చల్లాలి

శ్లోకం : పంచామృతైర్ణావ గృహాణ గణనాయక
అనాధ నాద సర్వజ్ఞా గీర్వాణ గణ పూజిత
పంచామృత స్నానం సమర్పయామి .
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః శుద్దోదక స్నానం సమర్పయామి
తమలపాకు తో స్వామి పై నీళ్ళు చల్లాలి

శ్లోకం : గంగాది సర్వ తీర్దేభ్యః అహృతైరమలైర్జైలై
స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమో స్తుతే
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః శుద్దోదక స్నానం సమర్పయామి
తమలపాకు తో స్వామి పై నీళ్ళు చల్లాలి

శ్లోకం : రక్త వస్త్ర ద్వయం చారు దేవ యోగ్యంచ మంగళం
శుభ ప్రద గృహాణత్యం  లంబోదర హరాత్మజం
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః వస్త్ర యుగ్మం  సమర్పయామి
వస్త్రమును సమర్పించాలి .

శ్లోకం : రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞా భక్తానామిష్ట దాయక
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః యజ్ఞోప వీతం  సమర్పయామి
జంద్యమును సమర్పించాలి

శ్లోకం : చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతి గృహ్య తాం
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః గంధం  సమర్పయామి
గణపతి పై గంధం చల్లాలి .

శ్లోకం : అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభు పుత్రా నమోస్తుతే
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః అక్షతాన్  సమర్పయామి
స్వామి  పై అక్షతలు వేయాలి

శ్లోకం : సుగన్ధాని చా పుష్పాణి జాతీ కుండ ముఖానిచ
ఏక వింశతి పత్రాణి సం గృహాణ నమోస్తుతే
ఓం సిద్ది వినాయక స్వామినే  నమః పుష్పాణి పూజా యామి

స్వామిని పూలతో అలంకరణ చేయాలి .
ఈ విధంగా షోడశోపచార పూజ విధానము పూర్తీ చెయ్యాలి .

అధాంగపూజ
పుష్పములతో పూజించాలి
గణేశాయ నమః పాదౌ పూజయామి ఏక దంతాయ నమః గుల్పౌ పూజయామి శూర్పకర్ణాయ నమః జానునీ పూజ యామి విఘ్నరాజాయ నమః  జంఘౌ పూజయామి అఖువాహనాయ నమః ఉరూం పూజయామి హేరంబాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజ యామి గణ నాదాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమ హృదయం పూజయామి స్థూల కంటాయ నమః కంటం పూజయామి స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజ యామి పాశ హస్తాయ నమః హస్తౌ పూజ యామి గజ వక్త్రాయ నమః వక్త్రం పూజ యామి విఘ్న హంత్రే నమః నేత్రం పూజయామి శూర్ప కర్ణాయ నమః కర్ణం పూజయామి ఫాల చంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి విఘ్న రాజయ నమః సర్వాణ్యంగాని పూజాయామి .

ఏక వింశతి పత్రపూజ .

ఓం సుముఖాయనమః  మాచీ పత్రం పూజాయామి
ఓం గణాధిపాయ నమః  బృహతీ పత్రం పూజాయామి
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజాయామి
ఓం గజాననాయనమః   దూర్వాయుగ్మం పూజాయామి
ఓం హరసూనవే నమః  దత్తూర పత్రం పూజాయామి
ఓం లంబోదరాయనమః బదరీ పత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయనమః అపామార్గ పత్రం పూజాయామి
ఓం గజకర్ణాయ నమః  వటపత్ర పూజాయామి
ఓం ఏక దంతయ నమః చూత పత్రం పూజాయామి
ఓం వికటాయనమః   కరవీర పత్రం పూజాయామి
ఓం భిన్న దంతాయ నమః విష్ణు క్రాంత పత్రం పూజాయామి
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజాయామి
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజాయామి
ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజాయామి
ఓం హేరంబాయనమః సింధువార పత్రం పూజాయామి
ఓం శూర్ప కర్ణాయ నమః జాజీ పత్రం పూజాయామి
ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజాయామి
ఓం ఇభ వక్త్రాయ నమః  శమీ పత్రం పూజాయామి
ఓం వినాయకాయ నమః అశ్వస్థ  పత్రం పూజాయామి
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజాయామి
ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజాయామి
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏక వింశతి పత్రాణి పూజాయామి

ధూపం
దశాంగం గుగ్గిలోపెతం సుగంధిం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ
ధూప మాఘ్రాప యామి
గుగ్గిలమును ధూపం వేయాలి

 దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశ పుత్రా నమోస్తుతే దీపం దర్శ యామి

దీపాన్ని స్వామికి చూపించాలి .


నైవేద్యం
పిండి వంటలు మొదలగు అన్నిరకముల పండ్లు అన్ని కూడా స్వామీ ముందు ఉంచాలి .
శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః
మహా నైవేద్యం సమర్పయామి
ఓం భూర్భువస్సువః తత్సత్ వితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
  సత్వం త్వర్తెన పరిషించామి  అని నైవేద్యము చుట్టు నీళ్ళు తిప్పాలి .
  అమృత మస్తు పసుపు గణపతి దగ్గర నీళ్ళు వదలాలి .
అమృతోప స్తరణమసి ..    అని నైవేద్యం పైన నీళ్ళు చల్లి స్వామీ వారికి సమర్పించాలి .
    
     మంత్రం పుష్పం

లేచి నిలబడి పూలు అక్షతలు చేతితో పట్టుకొని ఈ శ్లోకమును చదివి పూలు అక్షతలు స్వామి పాదాల పై ఉంచాలి.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
అవిఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
  ప్రదక్షిణ
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్కాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప
అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పర్పయామి .
ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారము చేయాలి . తరువాత కూర్చొని
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యాన మావాహానాది షోడచాప చార పూజయాచ అష్టోత్తర నామార్చనయాచ అవసర మహా
నివేదన యాచ  భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహా గణాధిపతి దేవతార్పణ మస్తు
శ్రీ మహా గణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు ........
పూజాక్షతలు శిరస్సున ధరించాలి .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...