2013-09-07

వినాయక వ్రత కధ

 వినాయక వ్రత కధ  కావలసిన వారు ఈ దిగువ లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
www.scribd.com/doc/166247538/వినాయక-వ్రత-కధ 


సూత మహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పినాడు . పూర్వకాలములో ఏనుగు ముఖము కలిగిన రాక్షసుడు ( గజాసురుడు ) శివుని కొరకు తపస్సు చేసాడు . బోళా శంకరుడైన పరమేశ్వరుడు అతని తపోదీక్షకు మెచ్చి ప్రత్యక్ష మయ్యాడు . అతనిని వరము కోరుకొమ్మని అడిగాడు . అంతట ఆ రాక్షసుడు తనకు ఎవరి  చేత మరణము లేకుండు నట్లు , అనంత శక్తి సామర్ధ్యములను ప్రసాదించమని , మరియు పరమేశ్వరుడు తన గర్భములో ఉండాలని వరము కోరుకున్నాడు . ఆతనికి ఇచ్చిన మాట ప్రకారము శివుడు వరముల ప్రసాదించి గజాసురుని గర్భములో ప్రవేశించినాడు .

ఈ విషయమును తెలుసుకున్న పార్వతీ దేవి తన భర్తను గురించి చింతించ సాగింది . కైలాసము బోసిపోయింది . జగన్మాత పార్వతీ దేవి భర్త పరమేశ్వరుని విడిపించి తెచ్చుటకు ఉపాయము ఆలోచించిది . వెంటనే విష్ణువు సహాయము కోరింది . అంతట విష్ణు మూర్తి ఒక పధకము వేసాడు . విష్ణువు గంగిరెడ్ల వాని వలె వేషధారణ గావించాడు . శివుని వాహనము నందీశ్వరుని గంగిరెద్దు లా అలంకరించారు .

 పిమ్మట గజాసురుని రాజ్యమునకు వెళ్లి అక్కడ గంగిరెద్దు తో నాట్యము చేయించడం మొదలు పెట్టాడు . ఈ విషయము తెలుసుకొన్న గజాసురుడు గంగిరెద్దు మేళం వారిని తన ఆస్థానమునకు పిలిపించాడు . గజాసురుని సన్నిధిలో విష్ణువు గంగిరెద్దు తో అనేక విధముల నాట్యములను చేయించాడు . ఆ నాట్యమును తిలకించిన గజాసురుడు మంత్రం ముగ్ధుడై కావలసిన వరము కోరుకో అన్నాడు . అంతట విష్ణువు ఇచ్చిన మాట తప్పకుండా నేను కోరిన వరములు ఇయ్యాలి అన్నాడు . అందుకు గజాసురుడు సరేనన్నాడు .

నీ గర్భములో ఉన్న పరమేశ్వరుని విడచి పెట్ట మన్నాడు . విషయమును గ్రహించిన గజాసురుడు ఇచ్చిన మాట ప్రకారము శివుని విడిచి పెట్టుటకు అంగీకరించాడు . అంతట నందీశ్వరుడు వాడియైన తన కొమ్ములతో గజాసురుని కడుపులో పొడిచి ఈశ్వరుని విడిపించాడు . గర్భము చీలిఉన్న గజాసురుడు ఉత్తర దిశగా పడిపోయాడు . ఆఖరిగా గజాసురుడు శివుని ఒక వరం కోరాడు .. నేను ఇచ్చిన మాట ప్రకారము మిమ్ములను విడచి పెట్టాను . నాకు మీ సన్నిధిలో స్థానం ఇవ్వండి అన్నాడు . నాకు ముల్లోకములలో పూజలందు కొను భాగ్యమును ప్రసాదించండి . అందుకు పరమేశ్వరుడు సరే అన్నాడు . 

శివుడు గజాసురుని గర్భము ఉండి విముక్తుడైనాడని తెలుసు కొన్న పార్వతీ దేవి ఎంతో సంతోషముతో ఉన్నది . తన భర్తకు స్వాగతము పలుకుటకై సిద్ధ మగుచున్నది .అభ్యంగన స్నానము ఆచరించుటకై నలుగు పిండిని సిద్ధం చేసుకుంది . భర్త రాకకై ఎదురు చూస్తూ పర ధ్యానముతో నలుగు పిండి తో ఒక బాలుని బొమ్మను తయారు చేసింది . ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ట చేసింది . ముగ్ధ మనోహర రూపము కలవాడై చూచుటకు చాలా అందముగా కనిపించు చున్నాడు . ఆ బాలునకు ఉండ్రాళ్ళు  మొదలగు తిను బందారములను ఇచ్చినది . ద్వారము వద్ద కాపలా ఉంచి తన పనులకై ఇంటి లోపల ఉన్నది .

పరమేశ్వరుడు ఇంటికి వచ్చాడు .ద్వారము వద్ద ఉన్న బాలుడు లోనికి వెళ్ళకుండా అడ్డుపడ్డాడు . ఇద్దరి మధ్య వాదోప వాదములు జరిగాయి . చివరకు పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై తన వద్దనున్న త్రిశూలముతో బాలుని శిరసు ఖండించాడు . జరిగిన విషయమును తెలుకొన్న పార్వతి బోరున విలపించింది . బాలుని మరణమును తట్టుకోలేక పోయింది . ఇది గమనించిన బ్రహ్మ , విష్ణువులు కైలాసమునకు వచ్చినారు. పార్వతిని శాంతించ మణి చెప్పి ఈ బాలునికి ప్రాణ ప్రతిష్ట చేస్తామని చెప్పి ఊరడించినారు. 

అయితే ఈ బాలుని మొండెమునకు అతికించుటకు శిరస్సు కావాలి . ఎలా ఆలోచించ సాగారు. అప్పుడు పరమేశ్వరుడు గజాసురునికి ఇచ్చిన వారము గుర్తుకు వచ్చింది . ఉత్తర దిశలో చచ్చి పడి వున్న దేహము యొక్క శిరస్సును తెమ్మని ఈశ్వరుడు తన భటులకు ఆజ్ఞాపించాడు .

భటులు గజాసురుని శిరస్సును తెచ్చారు . ఏనుగు ముఖము ను చూసిన పార్వతి ఎంతో అందముతో ఉన్న నా కుమారుడు ఇన్నత వికార రూపముతో ఉంటాడా అని అందుకు సమ్మతించలేదు . అంతట బ్రహ్మ విష్ణువు మొదలగు వారందరూ పార్వతిని వారించి అందము లేక పోయిన నీ కొడుకు ముక్కోటి దేవతలకు ఆరాధ్యుడు అవుతాడు . అపార మేధా సంపత్తి ఇతనికి కలుగుతుంది . విద్యా వినయ సంపన్నుడు . అనంత శక్తి స్వరూపుడు . అవుతాడు . అని పార్వతికి నచ్చ చెప్పారు . 

పిమ్మట గజముఖమును బాలుని మొండెమునకు అతికించి బ్రహ్మ దేవుడు ప్రాణ ప్రతిష్ట చేశాడు . ఆ బాలుడే గజాననుడు అయ్యాడు .శివ పార్వతుల ముద్దుల కుమారుడయ్యాడు .అనింద్యుడు అను మూషిక రాజమును వాహనముగా చేసుకొన్నాడు .విఘ్నములకు అధిపతిగా గజాననుని  నియమించాలని పరమేశ్వరుడు నిర్ణయించాడు 

ఆ ఆధిపత్యము తనకే ఇవ్వాలని శివుని రెండవ కుమారుడు కుమారా స్వామి కోరినాడు . అందుకు పరమేశ్వరుడు గజాననుడు కి కుమారస్వామి కి పోటీ పెట్టాడు . మీ ఇద్దరిలో ముందుగా ఎవరు ముల్లోకములను అందున్న పవిత్రమైన నదులయందు స్నానమాచరించి ముందుగా వస్తారో వారికే ఈ పదవి దక్కుతుందని చెప్పాడు . అందుకు సమ్మతించి కుమారస్వామి తన నెమలి వాహనమును వేసుకొని బయలు దేరాడు .
అంతట గజాననుడు ఖిన్నుడై తండ్రీ నా ఈ భారీ రూపముతో నేనీ పరీక్షను గెలవా గలనా. నా శక్తి కి మించిన పరీక్ష పెట్టితిరి అని అనుకోని దీర్ఘముగా ఆలోచించి ఉపాయమును తెలుసు కొన్నాడు . 

నారాయణ మంత్రమును స్తుతించి . తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాడు . ఈ ప్రభావము వలన నదుల వద్దకు స్నానమాచరించుటకు వెళ్ళుచున్న కుమారస్వామికి గజాననుడు ప్రత్యక్షము అగు చున్నాడు . కుమారస్వామి తిరిగి కైలాసమునకు చేరే టప్పటికి గజాననుని దర్శించి , ఆతని బుద్ది సూక్ష్మతను, జ్ఞానాన్ని , తెలివి తేటలను చూసి విఘ్నాదిపత్యము గజాననునికి ఇవ్వాలని కోరాడు ఆ విధముగా విఘ్నాధిపత్యము పొందుట వలన గజాననునికి విఘ్నేశ్వరుడుగా , విఘ్నములకు నాయకుడు కాబట్టి వినాయకుడుగా పేరు వచ్చింది . ఇది బాద్రపద శుద్ధ చవితి నాడు జరిగింది . కావున ప్రతి సంవత్సరము బాద్రపద శుద్ధ చవితి ని వినాయక చవితి గా చెప్పడం జరిగింది .

విఘ్నములకు అధిపతి యైన సందర్భముగా ఆ రోజు ముక్కోటి దేవతలు , సమస్త లోకములలో ఉన్న ప్రజలు అందరూ వినాయక చవితి పండగ జరుపుకొన్నారు .. పండగలో అందరూ బహూకరించిన పిండి వంటలు మున్నగునవి వినాయకుడు తనివితీరా ఆరగించాడు . పెద్దబొజ్జ వచ్చింది .పండగ హడావడి తరువాత వినాయకుడు తల్లి దండ్రుల వద్దకు వెళ్లి  నమస్కారము చేయబోయి తలక్రిందులుగా పడిపోయాడు .అది చూసి శివుని శిరస్సున ఉన్న చంద్రుడు నవ్వాడు . చంద్రుడు నవ్వడం గమనించిన పార్వతి తన కుమారుని అపహాస్యం చేసినాడు . కనుక చంద్రుని ముఖము చూసిన వారికి పాపములు తగులుతాయి . నీ ముఖము ఎవ్వరూ చూడకుండు గాక అని శపించింది .

అప్పుడు ముక్కోటి దేవతలు మునులు సాధుపుంగవులు అందరూ కూడా దేవ దేవుని ప్రార్దిన్చినారు . చంద్రుని చూడకుండా లోకములోని జనులు ఎలా ఉంటారు . దీనికి ఉపాయమును చెప్పుమని ప్రార్దిన్చినారు .
అంతట పరమేశ్వరుడు బాద్రపద శుద్ధ చవితి నాడు గణేశుని పూజించి , వినాయక వ్రతం ఆచరించి కధను చెప్పుకున్నవారికి , విన్నవారికి , పూజాక్షతలు శిరస్సున ధరించిన వారికినీలాప నిందలురావు అని చెప్పాడు . 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...