2013-09-28

పూర్వాబాద్ర నక్షత్ర ఫలితము

పూర్వాబాద్ర నక్షత్రము లో పుట్టిన వారు సౌమ్యులు . శాంత స్వభావము కలిగి ఉంటారు . కొంచెం అమాయకత్వము కలిగి ఉందురు. వీరు ఉన్నదానితో తృప్తి పొందగలరు . మేధావులు . తెలివైనవారు . ఉన్నత విద్యాభ్యాసము చేయుదురు . తొందరపాటు లేకుండా నిదానముగా ఆలోచించ గలరు .అతి సున్నిత మనస్కులు . ఇతరుల పట్ల జాలి , దయ , కరుణ కలిగి ఉందురు .వీరికి మనోధైర్యము తక్కువనే చెప్పాలి . ఇతరులను తొందరగా నమ్ముతారు . దీనిని అలుసుగా తీసుకొని వీరిని మోసము చేయుటకు ప్రయత్నింతురు . జాగ్రత్త వహించనిచో వీరు ఇతరుల చేతిలో మోసపోవుదురు .

ఈ నక్షత్రము నకు అధిపతి బృహస్పతి . ఈ గ్రహ ప్రభావము చేత వీరు సంఘమున ఉన్నత స్థితిలో రాణించగలరు . పరోపకారము చేయుటకు వెనుకాడరు . గొప్ప గౌరవ మర్యాదలను పొందుతారు . వీరిలో కొంత మందికి గొప్ప గొప్ప సన్మానములను పొందు అవకాశములు కలుగును . వీరు భయస్తులు. తమ స్వంత విషయములలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా గాబరా పడతారు .  ప్రతి విషయము తన ఆలోచనలకు అనుగుణముగా జరగాలని కోరుకుంటారు .దీనికి భిన్నముగా జరిగితే మాత్రము కంగారు పడి ఆందోళన చెందుతారు .

కుంటుంబం , తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు భార్యా పిల్లల పట్ల మంచి సత్సంబంధములు కలిగి ఉంటారు . వీరికి బంధుప్రీతి ఎక్కువ . కుటుంబమును ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అహర్నిశలు శ్రమిస్తారు . సంతానము యొక్క అభివృద్ధిని చూసి పొంగిపోతారు . తన పిల్లల భవిష్యత్తు కొరకు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉందురు . వారికి ఉన్నతమైన జీవన విధానము ఏర్పరచుట కొరకు ముందు చూపుతో వ్యవహించ గలరు . మంచి క్రమ శిక్షణ కలిగిన నడవడికను నేర్పుతారు .

వీరు పొగడ్తలకు లొంగి పోతారు. ఈ బలహీనతను అలుసుగా చేసుకొని ఇతరులు వీరిని పొగడ్తలతో లొంగదీసుకొని తమ పనులను చాకచక్యముగా నేరవేర్చుకొందురు .వీరు గొప్ప దైవభక్తి కలవారు . ఆచార సంప్రదాయములపై మక్కువ ఎక్కువ. ధర్మ గుణము కలిగి ఉందురు . తనను నమ్మిన వారికి లేక శరణు జొచ్చిన వారికి అభయమిచ్చి ఆడుకొంటారు . ఇతరులకు ఉపాయములు చెప్పి వారి జీవన అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారు . వీరు పలువురు మన్ననలను పొందుతారు . ధార్మిక సంస్థలు , సంఘ సంస్కర్తలుగా రాణిస్తారు .

వీరు డబ్బుకు అంతగా ప్రాధాన్యము ఇవ్వరు . న్యాయ , అన్యాయములను , ధర్మాధర్మములను  విచారించి ముందుకు సాగుతారు . అన్యాయము , అక్రమాలను సహించలేరు . ఓర్పు , సహనము ఎక్కువగా ఉంటుంది . ఇతరులకు మార్గదర్శకులై ఆదర్శ వంతమైన జీవితమును గడుపుతారు . సమాజమున ధనము కన్నా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండాలని కోరుకొంటారు. నీతి , నిజాయితీ  నియమ బద్ధమైన జీవితమును గడుపుటకు ఇష్ట పడతారు .  

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...