ఎవరెవరు ఏ ఏ షేర్స్ కొనాలి అనే విషయమును
తెలుసుకొనే ముందు ఏ గ్రహములు ఏ వస్తువులను సూచిస్తాయి . అను విషయములను క్షుణ్ణంగా
తెలుసుకోవాలి .
ఈ భూమిపై జన్మించిన ప్రతి మానవునకు
బ్రతకడానికి డబ్బు అవసరము . అయితే ఈ డబ్బు సంపాదన అందరికి ఒకే విధంగా , ఒకే
మార్గములో లభించుట లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రూపము (వస్తువు)మూలాన ఒక్కో విధంగా
సంపాదన కలుగుతుంది .
జాతకచక్రము ప్రకారము జన్మ లగ్నము నుండి రెండవ స్థానము ను ధనమును
గురించి , సంపద , సంపాదన మొదలగు విషయములను పరిశీలించాలని ఇంతకుముందు తెలుసుకొన్నాం
. ధన స్థానము ,అధిపతి , అందున్న గ్రహముల ఆధిపత్యము , దానిని చూస్తున్న గ్రహముల ఆదిపత్యములో ఉన్న వస్తు
మూలమున మానవునకు ధన సంపాదన కలుగుతుంది .
జాతకమును బట్టి జాతకునకు ఏ వస్తువుల మూలమున
సంపద వృద్ధి చెందునో తెలుసుకొని ఆయా కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడితే మంచి ప్రతి
ఫలం వచ్చే అవకాశము ఉన్నది . ఏ గ్రహములు ఏ కంపెనీల షేర్లపై ఆధిపత్యము వహించును అను
విషయాన్ని తెలుసుకొందాం .
జాతకము లో
ధన స్థాన అధిపతి శుక్రుడు అయితే ఆభరణాల తయారీ సంస్థలు ,వాహనములు ,ప్యాషన్
డిజైనింగ్ , రెడీమేడ్ వస్త్ర పరిశ్రమలు, అలంకార సామగ్రి , రంగుల పరిశ్రమలు ,
సినిమా , మీడియా , మొదలగు వాటిలో
పెట్టుబడి పెట్టాలి .
Ex : GITANJALI GEMS, ASIAN PAINTS ,
TITAN INDS, HUL , TV 18 , HERO MOTOCORP,
MARUTI, BAJAJ , MAHINDRA& MAHINDRA
బుధుడైతే బ్యాంకులు , ఫైనాన్సియల్
సంస్థలు , బ్రోకరేజ్ సంస్థలు మొదలగునవి.
Ex : SBI , AXIS BANK , YESBANK, HDFC ,
ICICI BANK , CMC, FINANTECH, INDIA INFOLINE
చంద్రుడైతే పాల పదార్దములు , ఐస్క్రీమ్స్
, షుగర్ కంపెనీలు , ఫుడ్ ప్రొడక్ట్స్ , హోమ్ ప్రొడక్ట్స్ .
Ex : RENUKA SUGAR, HUL , GLAXO, ADITYA
BIRLA NUVO, PANTALOON RETA, HAWKINS, PRESTIGE
రవి అయితే సీడ్స్ , భారీ సంస్థల షేర్లు కొనవచ్చు .
WIPRO, RELIANCE , KAVERI SEEDS,
కుజుడైతే ఎలక్టానిక్ సంబంధిత పరిశ్రమలు, రియల్
ఎస్టేట్ రంగములలో షేర్స్,రసాయన పరిశ్రమలు, విధ్యుత్ సంబంధిత పరిశ్రమలలో షేర్స్ కొనవచ్చు
.
RPOWER, TATA POWER, HDIL, DLF,
గురుడైతే విద్యా సంస్థలు, ప్రింట్ మీడియా
, సాప్ట్ వేర్ , పుస్తక పరిశ్రమలు , పర్యాటక శాఖ సంబంధిత రంగములకు చెందిన షేర్స్
INFY, TCS, WIPRO , SATYAM , HCL
శని అయితే బొగ్గు పరిశ్రమలు ,
కనస్ట్రక్షన్ కంపెనీలు, ఆయిల్ , ఇనుము , సిమెంట్ , సమాచార , గ్యాస్ , టేలీ కమ్యూనికేషన్స్ , పొగాకు పరిశ్రమలకు ఇన్సూరెన్స్ సంస్థలు చెందినవి మొదలగు షేర్స్ కొనవచ్చు .COAL INDIA, HPCL, BPCL, IOC, BHARTI AIRTEL, IDEA,
RCOM, ITC, RCAP, HDFC, ICICI
రాహువైతే మందుల పరిశ్రమలు, మత్తు
పదార్దములు ,లిక్కర్, లాబ్స్ సంబంధిత రంగముల షేర్స్ ,
REDDY LAB, RANBAXY, CIPLA, OPTO
CIRCUITS, UBL, MC DOWELL, PIRAMAL, PFIZER
కేతువైతే చర్మ సంబంధ ఉత్పత్తుల పరిశ్రమలు
చెప్పులు , లగేజ్ బ్యాగులు తయారు చేసే కంపెనీల
షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన ధన వృద్ధి కలుగుతుంది ..
VIP, BATA INDIA, LIBERTY
ఇలా ప్రతి విభాగానికి గ్రహముల యొక్క
కారకత్వమును తెలుసుకొని జాతక ప్రకారము ధన యోగమును తెలుసుకొని సంబంధిత గ్రహ
కారకత్వములో ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడితే లాభము పొందు అవకాశము ఉన్నది .