2013-09-06

వినాయక వ్రతము – పూజా సామాగ్రి



ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
వినాయక వ్రతము పూజా సామాగ్రి
మట్టి వినాయక విగ్రహం , పసుపు , కుంకుమ , అక్షతలు , గంధం , గుగ్గిలం ,కలశము ,గంట , ఆచమన పాత్రలు 2 , ఉద్ధరిణిలు 2 , అగరబత్తీ పేకెట్ , కర్పూరం పేకెట్ , కొబ్బరికాయలు , అరటిపండ్లు , తమలపాకులు , వక్కలు , పళ్ళాలు 2 , దీపారాధనకు వస్తువులు , జంధ్యాలు 2 , పంచామృతం , పీటలు .

నైవేద్యము : ఉండ్రాళ్ళు , అప్పాలు , పరమాన్నం , కుడుములు ,  అటుకులు, బెల్లం , నానుబ్రోలు , చలిమిడి , సీతాఫలం పండ్లు , చెరకు గడలు , మొక్క జొన్న పొట్టలు , 

పువ్వులు మరియు పత్రులు : నాలుగు లేక ఐదు రకముల పండ్లు , చామంతి , గన్నేరు , తంగేడు, తెల్ల జిల్లేడు  మొదలగు పువ్వులు ,  మామిడి కొమ్మలు , మామిడి ఆకులు , మారేడు , నేరేడు , జమ్మి ,జిల్లేడు , గరిక , తంగేడు , మొదలగు పత్రులు  ఇవన్నీ సిద్దం చేసుకోవాలి .

పూజ చేయవలసిన విధి

వినాయక చవితి రోజు వేకువ జామున లేచి కుటుంబ సభ్యులందరూ తలంటుస్నానం చేయాలి . ఇల్లంతా శుభ్రం చేయాలి . పైన తెలిపిన పూజా సామగ్రి సిద్దం చేసుకోవాలి . మీ గృహములో పూజగదిలో గానీ పూజ గది లేనివారు ఈశాన్య దిశలో గానీ స్థలాన్ని శుద్దిచేయాలి . బియ్యపు పిండి , ముగ్గు పిండితో లేక రంగులతో ముగ్గు వేయాలి .
పిమ్మట గణపతిని ప్రతిష్టించుట కొరకు ఒక పీటను సిద్దంచేయాలి . ఆ పీటకు పసుపురాసి , కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గు వేయాలి . ఆ పీటపై ముందుగా సిద్దం చేసుకొన్న గణపతి విగ్రహాన్ని ఉంచాలి .
తరువాత కుంటుంబ సభ్యులందరూ బొట్టు పెట్టు కోవాలి .

పూజ చేసేవారు కూర్చునేందుకు మరొక పీటను సిద్దం చేసుకోవాలి . పీటపై తెల్లని వస్త్రమును పరచి అక్షతలు వేయాలి. తాంబూలం కుడి చేతితో పట్టుకొని ఈ విధంగా చదువుతూ పీటపై కూర్చోవాలి .

 శ్లోకం : శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
          ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే .

పీటపై కూర్చున్న తరువాత మొదటగా తమల పాకును తీసుకొని గణపతి దగ్గర ఉంచాలి . కొంచెం పసుపు పొడిని తీసుకొని నీటితో తడిపి పసుపు గణపతి గా చేయాలి . కుంకుమ బొట్లు పెట్టి తమల పాకు పై ఉంచాలి .

ప్రార్ధన
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమ కేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్ప కర్ణో , హేరంబః స్కంద పూర్వజ:

ఈ పూజా విధానము పూర్తిగా చూడాలంటే వినాయక వ్రతం పేజీ లో చూడవచ్చు

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...