2013-09-30

పంచాంగము - Hindu Calender



పంచాంగము అనగా అయిదు అంగములను గురించి వివరిచేది అని అర్ధము
తిధి , వారము , నక్షత్రము , యోగము , కరణము అను అయిదు అంగములు కలది పంచాంగము .
తిధులు ముప్పై , వారములు ఏడు ,నక్షత్రములు ఇరవై ఏడు, యోగములు ఇరవై ఏడు , కరణములు పదకొండు .
తిధులు : పాడ్యమి , విదియ , తదియ ,చవితి ,పంచమి , షష్టి. సప్తమి , అష్టమి , నవమి , దశమి , ఏకాదశి , ద్వాదశి , త్రయోదశి , చతుర్ధశి ,పూర్ణిమ లేక అమావాస్య

వారములు : అది , సోమ , మంగళ , బుధ , గురు, శుక్ర , శని  వారములు

నక్షత్రములు : అశ్విని , భరణి , కృత్తిక , రోహిణి , మృగశిర , ఆరుద్ర , పునర్వసు , పుష్యమి , ఆశ్రేష , మఖ , పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త , స్వాతి , విశాఖ , అనూరాధ , జ్యేష్ఠ, మూల , పూర్వాషాడ , ఉత్తరాషాడ , శ్రవణం , ధనిష్ఠ , శతభిషం , పూర్వాభాద్ర , ఉత్తరాభాద్ర , రేవతి నక్షత్రములు .

యోగములు : విష్కంభము , ప్రీతి , ఆయుష్మాన్ , సౌభాగ్యము , శోభనం ,అతిగండము , సుకర్మ , ధృతి , శూల , గండ , వృద్ధి, ధృవము, వ్యాఘాతము , హర్షము , వజ్రము , సిద్ది , వ్యతీపాత , వరీయాన్ , పరిఘ , శివం , సిద్ధ , సాధ్యం , శుభం , శుక్ల , బ్రహ్మ , ఐంద్రం , వైధృతి     ఇవి యోగములు . అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రముల వలె యోగములు ఒకదాని తరువాత ఒకటి వచ్చును .

కరణములు : బవ , బాలవ , కౌలవ , తైతుల , గరజి , వణజి , భద్ర , శకుని ,చతుష్పాత్ , నాగవము, కింస్తుగ్నం
ఇవి ఏడు కరణములు .

బవ , బాలవ , కౌలవ , తైతుల , గరజి , వణజి , భద్ర , కరణములు తిదికి రెండేసి చొప్పున వచ్చును మిగిలి నాలుగు అమావాస్య కు ముందు వచ్చే చతుర్ధశి రెండవ భాగమున ప్రారంభమై  . శకుని ,చతుష్పాత్ , నాగవము, కింస్తుగ్నం అను నాలుగు అమావాస్య పాడ్యమి మొదటి సగ భాగము వరకు ఉండును . ఈ నాలుగు కరణములు నెలలో ఒకసారి మాత్రమే వచ్చును .

వర్జ్యము : వర్జ్యము అనగా వదిలి వేయవలసిన సమయము ఏ  సమయములో ఏ విధమైన శుభ ముహూర్తములు చేయరాదు . ప్రతి రోజు వర్జ్యము ఒకే సమయములో ఉండదు . ఆ రోజున నక్షత్రమును బట్టి మారును . వర్జ్యము సుమారు 1 గంట ౩౦ నిమిషములు ఉండును .
దుర్ముహూర్తం  : దుర్ముహూర్తం సుమారు ౦ . 48 నిమిషములు ఉండును. ఇది  రోజును బట్టి ఏర్పడుచున్నది .
దుర్ముహూర్తములు పగటి యందు మాత్రమే ఉంటాయి . ఆదివారం  సూర్యోదయము నుండి 10 గంటల 24 నిమిషములకు వచ్చును .సోమవారం  సూర్యోదయము నుండి 6 గంటల 46 నిమిషములకు వచ్చును . మరలా  8 గంటల 48 నిమిషములకు వచ్చును  .మంగళవారం  సూర్యోదయము నుండి 2 గంటల 24 నిమిషములకు వచ్చును . మరలా  20 గంటల ౦ నిమిషములకు వచ్చును 
బుధవారం సూర్యోదయము నుండి 05 గంటల 36 నిమిషములకు వచ్చును.గురువారం  సూర్యోదయము నుండి 4 గంటల ౦౦ నిమిషములకు వచ్చును . మరలా  08 గంటల 48 నిమిషములకు వచ్చును  .శుక్రవారం  సూర్యోదయము నుండి 2 గంటల 24 నిమిషములకు వచ్చును . మరలా  06 గంటల 24 నిమిషములకు వచ్చును .శనివారం  సూర్యోదయము నుండి 1  గంటల 36 నిమిషములకు వచ్చును .

ఈ పైన తెలిపిన రోజు వారీ దుర్ముహూర్త సమయములను సూర్యోదయ సమయమునకు కలిపి చూసుకోవాలి
.
ఉదా : ఈ రోజు బుధవారము . . హైదరాబాదులో ఉదయం 05 గంటల 45 నిమిషములకు సూర్యోదయము జరిగింది .సూర్యోదయము + దుర్ముహూర్త ప్రారంభ సమయము , 05 . 45 + 05 . 36 = 11 . 21 నిమిషములకు దుర్ముహూర్తము ప్రారంభము .11. 21 ని.లు నుండి 12.09 ని.ల వరకు .
ఉదా :
అమెరికాలోని డల్లాస్ నగరములో ఈస్టర్ సమయము ప్రకారము 05 . 06 . 2013 బుధవారము 06 . 19 ని.కు సూర్యోదయము జరిగింది. 06 . 19 + 05. 36 =  11 . 55 ని.కు దుర్ముహూర్తము ప్రారంభమై 12 . 43 ని.లు వరకు ఉండును . ఈ విధంగా ప్రాంతములను బట్టి , తిధి ,నక్షత్ర సమయములు కూడా మారుచున్నవి .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...