2013-09-30

సమస్యలు - పరిష్కారాలు


పూర్వము నుండి మన భారతీయ సాంప్రదాయము లో స్త్రీలు ఆభరణములు ధరించుట , పురుషులు చైన్స్ , రింగ్స్ బ్రాస్లెట్స్ ధరించుట ఆచారముగా ఉన్నది . ఇవి చూచుటకు అందముగా , ఆకర్షించే విధముగా ఉంటాయి . అయితే ఈ ఆభరణములను ధరించే టపుడు కొన్ని జాగ్రత్తలు పాటించుట వలన శుభము చేకూరి సుఖ సంతోషములను పొందుతారు .

జ్యోతిష్య శాస్త్రములో గ్రహముల యొక్క దోషములను తొలగించుకొనుటకు కొన్ని పద్దతులను తెలియ పరచినారు . ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రమును గురించి వివరిస్తూ గ్రహముల స్థితి , వీక్షణ ,  దశా విధానమును అనుసరించి రెమిడీస్ చెప్పి యున్నారు . గ్రహ శాస్త్రము ప్రకారము జాతకమును పరిశీలించి దోషనివారణ కొరకు తెలుప బడిన పద్దతులను ఆచరించడం వలన దోషములు తొలగి సకల సౌభాగ్యములను మానవులందరూ పొందగలరు .

జనరల్ గా ఆలోచిస్తే ఒక కుటుంబములోని  సభ్యుల మధ్య అనుబంధము ఎక్కువగా ఉంటుంది . ఒకరికొకరు నిశితముగా పరిశీలన చేసుకొని లోపాలను గుర్తించుట చాలా సులభము. వీరిలోని లోపములను గుర్తించి లోపములను సవరించుటకు అవలంబించ వలసిన పద్దతులను , తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించుట వలన వారిలో మార్పు తీసుకు రావచ్చు .

అయితే ఎవరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి . ఏ విధమైన పద్దతులను అవలంబించాలి అని అందరికీ అనుమానము కలుగుతుంది . దీని కోసం మొదట కొంత ప్రాధమిక అవగాహన అవసరము .

అదేంటో చూద్దాం ?
ఉదా : ఒక కుటుంబములో భార్య , భర్త , ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకొందాం
పిల్లలిద్దరిలో ఒక పిల్లాడు ఎక్కువగా అల్లరిచేయడం , చదువు పట్ల  ఆసక్తి లేకపోవడం.  ఒకవేళ చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వలన మరచి పోతూ ఉంటాడు . ఇలాంటి వారిని కొట్టినా తిట్టినా లాభం ఉండదు . ఇలాంటి లక్షణములు తల్లిదండ్రులు సులభంగా తెలుసు కొంటారు .. నా దగ్గరకు కూడా చాలా మంది తల్లిదండ్రులు వచ్చి అడుగుతూ ఉంటారు . ఏమండీ మా పిల్లలకు చదువు అబ్బడం లేదండీ , చాలా అల్లరి చేస్తూ ఉన్నారండీ అని చెబుతూ ఉంటారు .

దీనికి ఎలాంటి రెమిడీ చెయ్యాలి ?
వీరి జాతకములో గురు బలం తక్కువగా ఉంటుంది . అందువలన మతి మరుపు , బద్దకము , లక్ష్య సాధన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు . వీరికి లెక్కలంటే భయము . కొంతమంది పిల్లలు ముభావముగా ఉంటారు . అన్నింటా వెనుక బడి పోతారు . బృహస్పతి విద్య , ఆలోచన, తెలివి తేటలు ప్రసాదిస్తాడు . ఈ గురు బలము తక్కువగా ఉన్న వారికి పైన తెలిపిన లక్షణములు ఉంటాయి . 

పిల్లలకు ధ్యానం చెయ్యడం అలవాటు చేయాలి . దీని వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది . సమయ పాలన అలవాటు చెయ్యాలి . క్రమశిక్షణను నేర్పాలి . కనక పుష్య రాగమును ఉంగరము చేయించి గానీ , లేదా లాకెట్ రూపములోగానీ మెడలో ధరింప చేయాలి . జీవితమున ప్రతి నిమిషము విలువైనది గా గుర్తించే విధముగా కొన్ని రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి . దైవారాదన అలవాటు చేయాలి . గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలను గురుంచి కధలు చెప్పాలి . దీనివలన పెద్దవారయిన తరువాత తమ జీవితమునకు లక్ష్యమును నిర్ణయించుకొనే శక్తి వీరికి పెంపొందుతుంది

పొడుపు కధలు చెప్పాలి . దీనివలన ఆలోచనా శక్తి పెరుగుతుంది . సమస్యలకు పరిష్కారము కనుగొనే శక్తి పిల్లలలో పెరుతుంది . వీటివలన జీవితములో భాద్యతలు పెరిగినపుడు కష్టములు , సమస్యలు ఎదురైనపుడు కుంగి పోకుండా మనోధైర్యముతో పరిష్కారములను ఆలోచించి ముందుకు నడిచే తత్వము అలవడుతుంది .

సమస్య మనదగ్గర ఉంది . సమాధానము కూడా మనదగ్గరే ఉంటుంది ‘’ . సాధించండి . శోధించండి .    

   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...