పుట్టిన పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడమే కేశ ఖండన
ఈ కార్య క్రమాలను ఎప్పుడు చెయ్యాలి .
పుట్టిన పిల్లలకు కేశఖండన చేయుటకు ఈ దిగువ తెలిపిన విధంగా చెయ్యాలి .
విదియ , తదియ , పంచమి , సప్తమి , దశమి , ఏకాదశీ , త్రయోదశి , తిధుల యందును అశ్విని , రోహిణి , మృగశిర , పునర్వసు, పుష్యమి , ఉత్తర ఫల్గుని , హస్త చితత,
అనూరాధ , ఉత్తరాషాడ , శ్రవణం, శతభిషం , ఉత్తరాభాద్ర , రేవతి నక్షత్రముల యందును ,
సోమ , బుధ , గురు , శుక్ర వారముల యందును ,
శుభ గ్రహ లగ్నములలోనూ , లగ్న శుద్ది , అష్టమ శుద్ది కలిగిన దినముల యందును సూర్యోదయము
తర్వాత నుండి మధ్యాహ్నము లోపల జరిపించాలి
స్త్రీ శిశువులకు బేసి నెలలయందు , మగ శిశువులకు సరి నెలల లోనూ జరిపించాలి . సంవత్సరము దాటి పోయినచో మూడవ సంవత్సరములో
జరిపించాలి .
దీనిలో ప్రాంతీయ ఆచారములు , కులాచారములు కూడా ఉన్నవి . అయితే వారి వారి
ఆచారములను బట్టి కొంత మంది దేవాలయములలోనూ , కొంతమంది ఇంటి వద్దనే ఈ కార్య
క్రమములను జరిపించు చున్నారు . ఎవరు ఎలా జరిపించిననూ పైన తెలిపిన విషయములను పాటిస్తూ మంచి శుభ
ముహూర్తమును నిర్ణయించుకొని శాస్త్రాచారము ప్రకారము జరిపించు కొనవలెను .
No comments:
Post a Comment