2013-10-31

గ్రహములు – వర్ణన

ఈనాడు ప్రపంచములో వివిధ దేశముల మధ్య ఉన్న సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థలు లేని కాలంలో జ్యోతిష్య శాస్త్ర పరిశోధన భారతదేశములో జరిగిఉండవచ్చు .

ఎందుచేత అని మనం ప్రశ్నించుకొంటే గ్రహములకు మరియు రాశులకు  చెప్పిన వర్ణన అంతా భారతీయ ధర్మములలోని హిందూ ధర్మమునకు చెందినవే అయి ఉన్నవి.   సూర్యునితో సహా నవగ్రహములను దైవాంశచే ఏర్పడినవని గ్రహములు దైవ స్వరూపమని. చెప్పితిరి. మరియు గ్రహ సంజ్ఞలను గ్రహ గుణములను గ్రహములకున్న నైసర్గిక మిత్రులు , శత్రువులు , సములు అని అనేకరకములుగా గ్రహ వర్ణన గురించి తెలపడం జరిగినది.

సకల జగత్తుకు ఆధారభూతుడైన సూర్యుని ఈశ్వర స్వరూపమని
చంద్రుని  జగన్మాతయగు  పార్వతీ మాత స్వరూపమని
కుజుని సుబ్రహ్మణ్యస్వామీ  స్వరూపమని
బుధ , గురులు  విష్ణు స్వరూపమని
శుక్రుని శ్రీ మహలక్ష్మి స్వరూపమని
శని  శనీశ్వర స్వరూపమని
రాహువు  దుర్గా స్వరూపమనియు
కేతువు విఘ్ననాయకుడైన వినాయక స్వరూపమనియు
ఆయా దేవతలు ఆయా గ్రహములకు అధిదేవతలని చెప్పితిరి.

మరియు
గురు శుక్రులు బ్రాహ్మనులనియు
రవి కుజులు   క్షత్రియులనియు
చంద్ర బుధులు  వైశ్యులనియు
శని శూద్రులు అని గ్రహ వర్ణన చేసినారు
ఇక్కడ గమనించవలసిన విషయము మన భారత దేశములో ఉన్న వ్యవస్థలను బట్టి పై విధంగా వర్ణించియుండవచ్చు. 

అయితే ప్రస్తుత సమాజమును బట్టి మనం దీనిని విశదీకరిస్తే
గురు శుక్రులు బ్రాహ్మనులనియు {అనగా మేధావులు లేక జ్ఞానులు }
రవి కుజులు   క్షత్రియులనియు  { అనగా రాజసము కలిగిన వారు , ప్రభుత్వ పాలకులు }
చంద్ర బుధులు  వైశ్యులనియు  { అనగా వర్తకము తెలిసిన వారు , వ్యాపారస్తులు }
శని  శూద్రులు  అని { అనగా సేవకా వృత్తి వలన జీవించువారు లేక పనివారు } అని  అర్ధము కలుగుచున్నది..

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...