చంద్రుడు కుజుడు ఈ రెండు గ్రహములు ఒకే స్థానములో ఉన్న జాతకులపై ఎలాంటి ప్రభావము ఉంటుంది అనే విషయమును గురుంచి
తెలుసుకొందాం .
చంద్రుడు కుజునితో కూడితే జరుగు ఫలితములు తెలుసుకొనే ముందు ఈ రెండు గ్రహముల
యొక్క తత్వములను తెలుసు కోవడం మంచిది . అదే విధముగా ఈ రండు గ్రహములు స్థితి పొందిన
రాశి స్వభావము పై కూడా గ్రహముల వలన కలుగు ఫలితములు ఆధారపడి ఉండును . చంద్రుని తత్వము ఈ గ్రహము జల తత్వము కలిగినది . ద్రవరూప స్వభావము కలిగి
ఉంటుంది . నీటిలో కరిగే ప్రతి వస్తువు ఈ
గ్రహము యొక్క తత్వమును కలిగి ఉంటుంది . ఉదా : పంచదార , ఉప్పు , గ్లూకోజ్ , మొదలగునవి .
దీని అర్ధం ఏమిటి అంటే తొందరగా తన సహజమైన స్వభావమును కోల్పోయేవన్నీ ఈ గ్రహ పరిధి లో ఉంటాయి . అందుకేనేమో చంద్రుడు
మనస్సుకు కారకుడని మహర్షులు తెలిపితిరి . మనస్సులోని ఆలోచనలు కూడా క్షణ క్షణము
మారిపోతూ ఉంటాయి కదా ?
కుజుడు ఈ గ్రహము అగ్ని తత్వము కలది.
అగ్ని వెలుగునివ్వ గలదు. తేడా వస్తే ప్రచండమై దహించి వేయగలదు . కుజుడు ప్రభావము
కూడా మానవునిపై ఇలాగే ఉంటుంది . చంద్రుడు మనస్సు కు కారకుడు అని తెలుసుకొన్నాం కదా . ఈ చంద్ర కుజ గ్రహముల సమాన
బలము కలిగి ఉండిన వారు దూర దృష్టితో ఆలోచించ గలరు . మంచి ప్రణాళిక తయారు చేసుకొని తదనుగుణముగా
జీవితములో హాయిగా ఆనందముగా జీవించగలరు .
అదే అగ్ని ప్రభావము ఎక్కువైనపుడు నీరు
ఆవిరిగా మారుతుంది . ఈ విషయములను చాలా
జాగ్రత్తగా గమనించ వలసిన అవసరము న్నది .
ఈ రెండు గ్రహముల కలయిక గానీ స్థితి
గానీ ఉన్నటువంటి జాతకులు జీవితమున ప్రతి విషయములోనూ ఆప్రమత్తముగా ఉండాలి . అదృష్ట వశమున భాగ్య వంతులైనా , గొప్ప గొప్ప అధికారములను పొందినా ఉన్నత స్థానములలో ఉన్న వారైనా గానీ వాటిని
కాపాడు కొనుట చాలా అవసరము .
చంద్రుడు మనస్సు కుజుడు దానిని ఆపరేట్
చేయువాడు. కుజ శక్తి బలహీన మైతే పరాజయములు
ఎదురగుచుండును . మానసిక ప్రశాంతత ఉండదు . పిరికి వారు . తొందర పది నిర్ణయములు
తీసుకొని నష్ట పోవుదురు . ముప్పు అనునది పొంచి ఉంటంది . ఎదో విధముగా నష్ట పోవుటకు అవకాశము ఉన్నది .
కుజుడు బలవంతుడు అయితే దార్శనికులు , ముందు చూపు కలవారు , శౌర్య పరాక్రమములు
కలవారు , ధైర్య వంతులు అగుదురు . వీరి లైఫ్ లో ఆకస్మిక ధనయోగములు కలుగును ఉన్నత
శిఖరములను అధిరోహింతురు . గొప్ప గొప్ప పదవులను పొందగలరు . తీసుకున్న నిర్ణయములను
ఖచ్చితముగా అమలుచేయుదురు . ఎంత కష్ట
సాధ్యమైన పనులైనా పట్టుదలతో సాధించ గలరు .
No comments:
Post a Comment