2013-10-22

చంద్ర గ్రహ ప్రభావము

చంద్ర గ్రహ ప్రభావము

 జాతక చక్రములో చంద్రుడు ఏ  గ్రహాములతో  కలసి నపుడు ఎలాంటి ఫలితములు  అను విషయమును గురించి తెలుసు కొందాము.

చంద్రుడు సూర్యునితో  కలసి నపుడు  శారీరక దుర్బలత్వము , భయము , మనో ధైర్యము లేకుండా ఉండడము , ప్రత్రి పనిలోనూ వెనుక బడి ఉండడము లాంటి  స్వభావమును కలిగి ఉంటారు .. చంద్రుడు మనస్సు కు కారకత్వము వహించు చున్నాడు . అందువలన వీరికి మనసు ఆందోళనతో నిండి ఉంటుంది  . ఇట్టి వారు తాము ఆలోచించి  చేయు ప్రతి విషయములోనూ వ్యతిరేక ఫలితములు కలుగును . వీరు తొందరగా  నిరాశ పడతారు , మనో భీతి ఎక్కువ . సాహించి ముందడుగు వేయలేరు .

ఈ విధముగా సూర్య చంద్ర గ్రహముల ప్రభావము ఉన్నవారు అమావాస్య  ఘడియలలో జన్మించిన వారి ఉంటారు . ఎందుకంటే  సూర్య చంద్రులు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడు చున్నది గదా ?  పైన తెలిపిన ఫలితములు  జాతక చక్రములో సూర్యునికి చంద్రునికి మధ్య ఉన్న దూరమును బట్టి  కొందరికి అత్యంత ఎక్కువగానూ , మరికొందరికి చాలా తక్కువగానూ కలుగుతూ ఉంటాయి .   

సుర్ర్యునితో కలసిన  ఏ గ్రహమైనా  అస్తన్గత దోషము పొందును . అస్తన్గత దోషము అంటే  ఆ గ్రహమునకు ఉన్న  బలమును కోల్పోయి  శూన్యత పొందును . గ్రహము వలన కలిగే శుభ ఫలితములను జాతకుడు పొందలేదని భావము . ఎలా అంటే సూర్య  చంద్రులు  గగనములో ఉన్నారు . కానీ  అమావాస్య రోజున  చంద్రుని వలన వెలువడు కాంతి  (వెన్నెల ) ని  భూమిపై నున్న మానవుడు చూడలేదు కదా ?

అంటే కాకుండా అమ్మావాస్య  సమయములో  మానసిక స్థితి భాగా లేనివారికి, పిచ్చి వారికి , మతి స్థిమితము లేనివారికి వారి యొక్క  మానసిక  స్థితిలో ఎక్కువగా మార్పులు కలుగుతాయని  విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా నిరూపించి ఉన్నారు . దీనికి కారణము ఏమిటంటే  అమావాస్య రోజున చంద్రుని కిరణాలు ( చంద్రకాంతి  ) భూమిపై  ప్రసరించక పోవడమే .


పుట్టినపుడు జాతక చక్రము ప్రకారము ఇలాంటి గ్రహ స్థితి ఉల్లవారి లో ఎక్కువగా  మానసిక సంఘర్షణకు లోనగుదురు . వీరి జీవితములో  చంద్ర మహా దశ జరుగు చున్న సమయములో ఎక్కువగా ఇబ్బంది పడతారు . జాతక చక్రములో  సూర్యునికి చంద్రునికి  మధ్య  సుమారు 15 డిగ్రీ ల కన్నా దూరము ఎక్కువగా ఉంటె  పైన తెలిపిన  వ్యతిరేక ఫలితములు  వీరికి వర్తించవు 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...