చంద్ర కుజ గ్రహముల ప్రభావమును గురుంచి ఇంతకూ ముందు శీర్షికలో కొంత తెలుసు
కొన్నాము . అయితే ఈ రెండు గ్రహములు విరుద్ధ
స్వభావము కలిగినవి . ఒకటి జల తత్వము కలిగినది . మరొకటి అగ్నితత్వము
కలిగినది . ఈ రెండింటి ప్రభావము సమానముగా ఉన్నప్పుడు జీవితమూ ఒడిదుడుకులు లేకుండా
హాయిగా సాగి పోతుంది . మరి ఒక గ్రహము యొక్క బలము ఎక్కువగా మరొక గ్రహము యొక్క బలము
తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితములు కలుగుతాయి అనే విషయమును కూడా ఇంతకూ ముందర
శీర్షికలలో కొంత వరకు తెలుసుకొన్నాము . అది ఎలాగంటే ఈ గ్రహముల
ప్రభావముచే మానవుడు అందలము ఎక్కుటయో
లేక అధః పాతాళానికి చేరుట యో జరుగు చున్నది .
అదెలాగో చూద్దాం . ఈ రెండు గ్రహముల ప్రభావము వలన మానవుని మెదడులో నిత్యమూ
సంఘర్షణ జరుగును .
ఈ రెండింటికి ఒక గ్రహము (చంద్రుడు )మరియొక (కుజుడు ) గ్రహము యొక్క స్వరూపమును
మార్చివేయగల శక్తి సంపన్నులు .
చిన్న ఉదాహరణ ఒక లీటరు నీటిని
తీసుకొని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తూ ఉంటే
అది తన సహజమైన స్వరూపమును కోల్పోయి వాయురూపములోకి మారుతుంది . పాత్రలో ఉన్న నీటిని కోల్పోవడం
జరుగుతుంది .
అదే విధముగా కొంత అగ్నిలో ఎక్కువ వాటర్ ని వేసి నపుడు అది బూడిదగా మారుతుంది .
భూతత్వములోకి మారుతుంది . దీనివలన మనకు అర్ధమయ్యే విషయము ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటె
ఒక గ్రహము యొక్క ప్రభావము మిగతా గ్రహముల వలన కలిగే శుభ అశుభములను తారు మారు
చెయ్యగల శక్తిని కలిగి ఉంటుంది .
మనిషి తన మెదడులో కలిగి ఒక చిన్న ఆలోచనతో తన జీవితమును బ్రహ్మాండముగా తయారు చేసుకోలడు
. అదే ఆలోచన భిన్నముగా ఉంటే కోలుకోలేని స్థితికి దిగజార గలడు . మానవుని మెదడులో కలిగే ప్రతి ఆలోచనపైనా చంద్ర ,
కుజ గ్రహముల ప్రభావము ఉంటుంది .
అందుకే జాతకమును పరిశీలించేటప్పుడు ఆ
జాతకములో ఒకే చోట చేరిన గ్రహములు ఏమైనా ఉన్నాయా
? ఉంటే వాటివలన కలిగే ప్రభావము జాతకుని
జీవితముపై ఎలా ఉంటుంది అనీ విషయములను పరిశీలించాల్సిన అవసరము ఉన్నది .
జాతకమునండు ద్వి గ్రహ కూటమి , త్రి
గ్రహ కూటమి , చాతుర్గ్రహ కూటమి , పంచ గ్రహ కూటమి , షష్ఠ గ్రహ కూటమి , సప్త గ్రహ
కూటమి , అష్ట గ్రహ కూటమి మొదలగు అన్ని విషయములను క్షుణముగా చూడవలసిన అవసరము ఎంతైనా ఉన్నది .
ఈ విషయములను గురించి తెలుసు కొనుటకే
గ్రహములకు గతులను , అవస్థలను , మొదలగు విషయములను మహర్షులు ఏర్పాటు చేసి
ఉన్నారు .
No comments:
Post a Comment