భూ పరిభ్రమణము గురించి మనకు తెలుసు . భూమి సూర్యుని చుట్టూ తిరిగే
కక్ష్యను 27 భాగములుగా విభజించి 27 నక్షత్రములు గా తెల్పితిరని మనము ఇంతకు ముందు
చెప్పుకొన్నాం .
సూర్యునకు కక్ష్య లేదని
మనము తెలుసుకొన్నాము .
జ్యోతిష్య శాస్త్రము ప్రకారము సూర్యుడు ఏ నక్షత్రములో ఉంటాడో ఆ
నక్షత్ర ము పేరుగల కార్తె గా చెప్పుచున్నారు . కానీ ఇది వాస్తవము కాదు . ఎందుకంటే
సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు . భూమితో సహా మిగాతా గ్రహములన్ని సూర్యుని చుట్టే తిరుగు చున్నవని విజ్ఞాన శాస్త్రవేత్తలు
నిరూపించినారు కదా. మరి అటువంటప్పుడు సూర్యుడు నిశ్చలముగా ఉన్నప్పుడు లేక సూర్యునకు
కక్ష్య లేనప్పుడు వివిధ నక్షత్రములలో ఎలా ప్రవేశిస్తాడు ?
ఇక్కడ ఒక్క విషయమును మనము గ్రహించాలి . సైన్సు , వాతావరణ విభాగము
అభివృద్ది కాక మునుపు మన పూర్వీకులు కార్తెల వలన ఉష్ణోగ్రతలను , వర్ష సూచన లను
తెలుసుకొని తదనుకూలంగా వ్యవ సాయము చేసే వారు .
ఈ కాలములో కూడా గ్రామాలయందు ప్రభుత్వము వారి సంస్థ అయిన వాతావరణ
కేంద్రము వారిచ్చే సలహాల కన్నా ఈ కార్తెలను బట్టే విత్తనములు నాటడం జరుగుచున్నది .
ఉదా : అగ్ని కర్తరి సాధారణముగా ప్రతి సంవత్సరము మే నెల 4 వ తేదీ నుండి
28 వ తేదీ వరకు ఉంటుంది . 4 నుండి 11 వ
తేదీ వరకు నడిచే కార్తెను డొల్లు కర్తరి గాను , 11 నుండి 28 వరకు నడిచే కర్తరిని
నిజ కర్తరిగానూ విభజించారు.
భూమికి కక్ష్య ఉన్నది . భూమి తన కక్ష్యలో రోజుకొక డిగ్రీ చొప్పున దీర్గ
వృత్తాకారముగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ కక్ష్య 27 నక్షత్రములుగా విభజించబడినది . భూమి తన
సంచారములో ఒక నక్షత్రమును విడచి మరొక నక్షత్రములో ప్రవేసించగానే ఆ నక్షత్ర నామము
గల కార్తె ఏర్పతుందని తెలుసు కోవాలి .
No comments:
Post a Comment