2013-11-08

పంచభూతాలు - గ్రహములు - రాశులు

సృష్టి లో ఉన్నప్రతీది పంచభూతాల సమ్మేళనమే.
పంచభూతాలైన భూమి , ఆకాశము ,అగ్ని, నీరు, వాయువు వీటి ప్రభావముచే సకల చరాచర జగత్తు ప్రేరిపితమగు చున్నది. విశ్వంలో జరిగే ప్రతి చర్య పంచభూతాల వలనే జరుగుచున్నది.నవగ్రహములు మరియు మేషాది ద్వాదశ రాశులు పంచ భూతముల అదీనములోనివే .

అది ఎలాననిన
నవగ్రహములలో రవి , కుజ గ్రహములు అగ్నితత్వము కలవి ..
చంద్ర , శుక్ర గ్రహములు జలతత్వము కలవి.
బుధుడు భూమి తత్వము కలవాడు
గురుడు ఆకాశ తత్వము కలిగినవాడు
శని వాయుతత్వము కలవాడు

అదే విధంగా మేష, సింహ , ధనుస్సు రాశులు అగ్నితత్వము
వృషభ, కన్యా , మకర రాసులు భూమి తత్వము
మిధున , తుల , కుంభ రాశులు వాయుతత్వము
కర్కాటక , వృశ్చిక , మీన రాశులు జలతత్వము కలవి.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...