2013-11-22

కుజదోషం- చర్చ

భారత దేశములో కుటుంబ వ్యవస్థ , వివాహ వ్యవస్థలు  ప్రపంచము లో ప్రత్యేక గుర్తింపు పొందాయి . ఇతర దేశముల వారు మన సంస్కృతి, సాంప్రదాయముల పట్ల ఆకర్షితులగు చున్నారు. మన కుటుంబ వ్యవస్థ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ అనురాగాము లు, ఆప్యాతల తో నిండి ఉంటుంది .

భర్త సంపాదనా పరుడు గానూ , భార్య కుటుంబ వ్యవహారములు , పిల్లల మంచి చెడులు , బంధువుల పట్ల మంచి ఆదరణ కలిగి కుటుంబ గౌరవము కాపాడుతూ ఉత్తమము గా ఉండాలి . వివాహము అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య సంభందము మాత్రమె కాదు . రెండు కుటుంబముల మధ్య సంభంధము .

అందుకే   ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పినారు .
దీపం లేని ఇల్లు ఏ విధముగా కళా విహీన మై ఉండునో  ఇల్లాలు లేని ఇల్లు కూడా అదే విధంగా ఉంటుంది .  

ఈ భూమి పై ప్రతి ఒక్కరు ఒకే విధంగా పుడతారు , పెరుగుతారు , వివాహ యోగము అందరికి ఒకే విధంగా ప్రాప్తించుట లేదు . కొందరికి యవ్వనము లో వివాహము జరుగుతుంది . కొందరికి ఎన్ని పెండ్లి సంభంధములు చూచినా సంభంధములు కుదురుట లేదు . ఆలస్యముగా వివాహము జరుగుతుంది . మరికొందరికి వివాహమే జరుగుట లేదు . ఇంకొంత మందికి  రెండు మూడు  వివాహములు జరుగు చున్నాయి  

ఇక దాంపత్య విషయానికి వస్తే  కొందరి జీవితము లలో  ఎంతో అన్యోన్యత కలిగి  దాంపత్యము ఆనందముగా సాగుతుంది . మరి కొందరి జీవితములో  ఎప్పుడూ ఏదో విధమైన గొడవలు , దంపతుల మధ్య స్పర్ధలు ఏర్పడి కుటుంబము చిన్నాభిన్న మవుతుంది.

కొంతమంది పురుషులకు భార్యా వియోగము (విడాకులు లేక మరణించడం ) కొంతమంది స్త్రీల కు వైధవ్య యోగము సంప్రాప్త మగుచున్నది . ఇంకా కొంతమంది స్త్రీలలో అయితే యవ్వనము లోనే వైధవ్యము కలిగి జీవితములో ఎంతో మానసిక వేదన అనుభవించు చున్నారు.  ఇన్ని సమస్యలకు కారణమేమిటని పరిశీలించి జాతకము నందున్న కుజదోష ప్రభావముచే ఈ విధమైన ఫలితములు కలుగుతాయని కుజుని అనుగ్రహము లేనిదే దాంపత్య జీవితము కొనసాగదని మహర్షులు చెప్పితిరి.

కుజ దోషం గురించి ఈ విధంగా చెప్పినారు
స్త్రీణాం భర్త్రు వినాసాయ పుం సాం భార్యా వినాశకః అనగా కుజ దోషము స్త్రీకున్న పురుషుడు , పురుషునకున్న స్త్రీ నాశన మవుతుంది .
కుజ దోషమును గురించి మరింత చర్చ తదుపరి శీర్షికలో ...............

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...