2013-11-23

రజస్వల విషయములు

స్త్రీలు రజస్వల అయిన సమయమును ఆధారముగా చేసుకొని లగ్నమును గ్రహ చక్రమును  వేయించి చూసినచో వివాహ జీవితమును గురించి తెలుసుకోవచ్చును అని పండితుల అభిప్రాయము స్త్రీల విషయములో జాతక చక్రము వాలే రజస్వల సామాను అనుసరించి ఫలితా నిర్ధారణ చేయవచ్చునని కొందరి అభిప్రాయము .
అశ్విని , రోహిణి , మృగశిర , పుష్యమి , ఉత్తర , హస్త , చిత్త , స్వాతి, విశాఖ , అనూరాధ , మూల , ఉత్తరాషాడ , శ్రవణం , ధనిష్ఠ , శతభిషం , ఉత్తరాభాద్ర , రేవతి నక్షత్రములలో ప్రధమ రజస్వల అయిన చాలా మంచిది .సంతాన సౌఖ్యము , మంచి భర్త లభించును .

పైన తెలిపిన నక్షత్రములు కాక మిగిలిన నక్షత్రములలో రజస్వల అయినచో దోషము కలుగును .
ఉదయ సమయము , మధ్యాహ్నమునకు ముందు సమయములలో రజస్వల అయిన స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కల్గునని , సుఖ సౌఖ్యములు కలిగి సుమంగళీ యోగము ప్రాప్తించును అనీ పెద్దల వచనము .
పాడ్యమి , చవితి , షష్టి , అష్టమి , నవమి , ద్వాదశి , చతుర్ధశీ , పూర్ణిమ , అమావాస్యల యందును , సూర్యాస్తమయ సమయములోనూ , అర్ధ రాత్రి యందును రజస్వల అయినచో అశుభము .
అర్ధరాత్రి సమయములో రజస్వల అగుట స్త్రీకి నష్టము . వీరికి వైధవ్య యోగము కలుగును .
తన స్వగృహమునందు రజస్వల అగుట మంచిది . ఇతరుల గృహముల యందు , మార్గ మధ్యమము నందునూ , ప్రయానములలోనూ రజస్వల అగుట చెడు ప్రభావము కలుగించును .

స్త్రీలకు రజో దర్శనము శుభ్రమైన గట్టిదైన వస్త్రములను ధరించి ఉన్నప్పుడు కలిగిన మేలు . పాతదైన , చినిగిన వస్త్రములను ధరించినపుడు జరుగుట అశుభము .
ఆది , మంగళ , శని వారము లలో కీడు జరుగును . మిగిలిన సోమ , బుధ , గురు , శుక్ర వారములు శుభము

పైన తెలిపిన దుష్ట తిధి , వార , నక్షత్రములు సంధి సమయములలో , అర్దరాత్రి సమయములో రజస్వల అయినచో శాస్త్రోక్తముగా శాంతి జరిపించి , హోమము , దాన ధర్మములను చేసినచో శాంతి జరుగును .   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...