2013-11-29

హోరా చక్రము .వివరణ

ప్రతి రోజు సూర్యోదయము నుండి మొదలుకొని గంటకు ఒక హోర చొప్పున ఉంటుంది .
ఉదా : ఈ రోజు శుక్ర వారం . సూర్యోదయము ఉదయము ౦6 : 16 నిమిషములకు జరిగింది . సూర్యోదయము నుండి ఒక గంట వరకు శుక్ర హోర ఉంటుంది .
ఏ రోజు ఏ సమయమునకు ఏ హోర ఉంటుంది అనే విషయమును హోరా చక్రములో చూడగలరు .  

ఈ దిగువ తెలుపబడిన హూరను అనుసరించి నిత్యము చేయు పనులలో గానీ , కొత్తగా ప్రారంభించబోయే పనులను గానీ హోర ప్రకారము చేయడం వలన జయము కలుగుతుంది.
.ఏ హోరలో ఎలాంటి పనులను చేయాలి . అనే సందేహము చాలా మందికి కలుగుతుంది .
ఉదా : ఉద్యోగము కొరకు దరఖాస్తు చెయ్యాలి అనుకొన్నప్పుడు రవి హోరలో చెయ్యాలి .

విద్య కొరకు కొత్తగా కాలేజీలో అప్లికేషన్ పెట్టాలని అనుకొన్నప్పుడు గురు హోరలో చెయ్యాలి.
ఆభరణములు , లేక వస్త్రములు లేక విలువైన వస్తువులు కొనాలని అనుకొన్నప్పుడు శుక్ర హూరాలో మొదలు పెట్టాలి . బంగారము మొదలగు వస్తువులు వాడాలని అనుకొన్నప్పుడు శుక్ర హోరలో చెయ్యాలి .

రాజకీయ సంబంధిత వ్యవహారములు , ప్రభుత్వ కార్యాలయాల లో , అధికారుల దర్శనము మొదలగు వ్యవహారములు రవి హోరలో చెయ్యాలి . గృహము లో గ్యాసు స్టవ్ మొదలగు వస్తువులు , హీటర్స్ మొదలగు అగ్ని సంబంధ వస్తువులను మొదట వాడేటప్పుడు కుజ హోరలో చెయ్యాలి . కోర్టు కేసులు , పోలీసు స్టేషన్ సంబంధిత వ్యవహారములను కుజ హోర లో ప్రారంభించాలి .

మాంసపు దుకాణాలు , ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలగునవి కుజ హూరలోనే వాడాలి .
శీతల పానీయాలకు సంబంధించిన వస్తువులుకు సంబంధించిన ప్రిజ్ , రిఫ్రిజ్రిటర్ , కూలర్స్ మొదలగునవి చంద్ర హోరలో వాడాలి .

బ్యాంకింగ్ లావాదేవీలు , భూమి రిజిస్ట్రేషన్ , పిక్సిడ్ డిపాజిట్ మొదలగు ఆర్ధిక సంబంధ వ్యవహారములను బుధ హోరలో చెయ్యాలి .

అన్నింటిని మించి శని హోర కొంత ఆలస్య ఫలితములను కష్ట నష్టములను కలిగించును .

 హోరా చక్రమును తదుపరి శీర్షికలో చూడగలరు . 




No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...