ద్విర్ద్వాదాశము వలన అంతగా చెడు ప్రభావము
కనిపించుట లేదు . కావున వధూ వరుల ఇరువురి రాశులు ద్విర్ద్వాశము అయినప్పటికీ
వివాహము చేయ వచ్చును .
షష్ఠ అష్టకములు అయినపుడు కూడా చేయ వచ్చునా అను
సందేహము కలుగుతుంది .
కొన్ని రాశుల విషయములో షష్ఠ అష్టకములు
అయినప్పటికినీ వివాహము చేయవచ్చు .
షష్ఠ అష్టకములు మూడు రకములుగా ఉన్నవి .
1 సమ షష్ఠ అష్టకములు 2 . మిత్ర షష్ఠ అష్టకములు
౩. శత్రు షష్ఠ అష్టకములు .
1,. సమ షష్ఠ అష్టకములు అనగా ఒకే గ్రహము ఆధిపత్యము
వహించు రాశులని తెలుసుకోవాలి.
సమ షష్ఠ అష్టక రాశులలో పుట్టిన వారికి
నిస్సందేహముగా వివాహము జరిపించవచ్చు .
ఉదా : వృషభ , తుల రాశులలో జన్మించిన వారికి
వివాహము చేయవచ్చు . ఈ రాశులకు శుక్ర గ్రహము
అధిపతి .
మేష , వృశ్చిక రాశుల లో పుట్టిన వారికి వివాహము
చేయవచ్చు . ఈ రాశులు రెంటికి కుజుడే అధిపతి .
2. మిత్ర షష్ఠ అష్టకములు అనగా ఒక రాశి కి చెందిన
అధిపతి అయిన గ్రహమునకు మరొక రాశికి చెందిన అధిపతి అయిన గ్రహము మిత్రుడై ఉండాలి . ఆ
విధముగా రెండు రాశుల మధ్య మిత్రత్వము కలిగియున్న రాశులను మిత్ర రాశులని అందురు .
ఉదా : కర్కాటక – ధనుస్సు , సింహం – మీనం , కన్య – కుంభం , మిధునం – మకరం ఈ రాశుల కు అధిపతులైన గ్రహములు పరస్పరము
ఒకరికొకరు మిత్రులై ఉండుట వలన దంపతుల మధ్య కొంత అన్యోన్యత లోపము ఉన్నప్పటికినీ
ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని సుఖముగా జీవింతురు .
౩. శత్రు షష్ఠ అష్టకములు . ఈ రకమైన రాశులకు
చెందిన వారికి ఎట్టి పరిస్థితులలోనూ వివాహము చేయరాదు .
ఉదా : మేషం – కన్య , తుల – మీనం , వృషభం – ధనుస్సు , మిధునం – వృశ్చికం , కర్కాటక – కుంభం , సింహం – మకరం ఈ జంటలకు వివాహము జరిపించుట వలన సంసారమున
అనేక ఇబ్బందులు కలుగుటయే కాక పరస్పరము
ఒకరికొకరు దూషించు కొందురు . వీరిలో చాలా మందికి విడాకులు తీసుకొనుట కూడా జరుగును
.
కావున వివాహము నిశ్చయించు నపుడు అనేక విధములుగా
ఆలోచించి పై విషయములన్ని క్షుణ్ణంగా పరిశీలించుట మంచిది .
No comments:
Post a Comment