గ్రహములు నిత్యమూ పరి భ్రమణము చెందుతూనే ఉంటాయి
.
ప్రతి గ్రహము తన కక్ష్య ను అనుసరించి ముందుకు
కదులుతూ ఉంటుంది . అలా గ్రహములు ఒకరాశినుండి మరొక రాశిలోకి ప్రవేశించు సమయమును తెలుసుకొని
మూర్తి నిర్ణయము చేయబడుతుంది .
ప్రతి సంవత్సరము మనం రాశీ ఫలితములను తెలుసుకోవడం
అనేది అనాదిగా వస్తున్నా ఆచారము . దీనికి ప్రత్యేకించి ఒక సమయాన్ని నిర్ణయించడం జరిగింది .
మన తెలుగు వారు ముఖ్యముగా ఉగాది నుండి సంవత్సరము
ప్రారంభము అయినట్లుగా భావించి రాశీఫలితములను తెలుసుకోవడం జరుగుతుంది . ఉగాది
సమయములో ఉన్న గ్రహముల స్థితి ప్రకారము మాత్రమే సంవత్సర ఫలితములు ఆధారపడి ఉండవు . గ్రహములలో
నిత్యమూ జరుగు సంచారమును బట్టి మానవునకు కలుగు శుభ, అశుభములు ఆధారపడి ఉంటాయి .
వీటిని సూక్ష్మముగా తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని మూర్తుల నిర్ణయము చేయడం
జరిగింది .
ఏ ఏ మూర్తుల వలన ఏవిధమైన ఫలితములు కలుగుతాయి అను
విషయములను మనం ఇంతకూ ముందర శీర్షికలలో తెలుసు కున్నాం .
ఇప్పుడు ఈ మూర్తులను ఎలా నిర్ణయించాలి అను
విషయములను తెలుసుకుందాం .
చద్రుని గమనము వలన నక్షత్రములను తెలుసుకోవడం
జరుగుతుంది . మనకు మన జన్మ నక్షత్రము తెలిస్తే జన్మరాశి తెలుస్తుంది . జన్మ
నక్షత్రము తెలియని వారికి పేరు లో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము
తెలుసుకోవచ్చు . ఆ విధముగా పేరులో ఉన్న మొదటి అక్షరము ప్రకారము ఏ నక్షత్రము అవుతుందో
గుర్తించి , ఆ నక్షత్రము ఏ రాశికి చెందినదో తెలుసు కొనుట చాలా సులభము
మీ పేరులోని మొదటి అక్షరము ప్రకారము మీది ఏ
నక్షత్రము ఏ రాశి అను విషయము తెలుసు కోవాలంటే ఈ దిగువన ఉన్న లింకును క్లిక్
చెయ్యండి .
జన్మ లేక నామ నక్షత్రము తెలుసుకున్న తరువాత
జన్మరాశిని లేక నామ రాశిని తెలుసుకోవాలి .
ఏ గ్రహమునకు మూర్తి నిర్ణయము చేయవలెనో మొదట
గుర్తించాలి . పిమ్మట ఆ గ్రహము ఏ రోజున ప్రవేశించు చున్నది . గ్రహము ప్రవేశించు
రోజున ఉన్న నిత్య నక్షత్రము ఏమిటి ? ఆ నక్షత్రమునకు సంభందించిన రాశి ఏమిటి అను
విషయమును జాగ్రత్తగా లెక్కించ వలెను . ఆ విధముగా లిక్కింపగా వచ్చిన రాశి సంఖ్యను బట్టి
మూర్తి నిర్ణయము చేయాలి .
జన్మరాశి లేక నామ రాశి నుండి
1
6 11 రాశులలో ఉన్న గ్రహములు సువర్ణ మూర్తులు
2
5 9 రాశులలో ఉన్న గ్రహములు రజిత ( వెండి ) మూర్తులు.
3
7 10 రాశులలో ఉన్న గ్రహములు తామ్ర ( రాగి ) మూర్తులు
4 8 12 రాశులలో
ఉన్న గ్రహములు లోహ ( ఇనుము ) మూర్తులు
ఈ విధముగా మూర్తి నిర్ణయము చేయాలి . పంచ లోహాలలో
వాటికి ఉన్న విలువను ఆధారముగా చేసుకొని గ్రహములు ఇచ్చు శుభ ఫలితములను
తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని ఈ మూర్తి నిర్ణయము చేయడం జరిగింది .
No comments:
Post a Comment