అష్టాదశ శక్తి పీఠాల లోని ఆలంపురం జోగులాంబ ఆలయం:
దేవి యొక్క 18 వివిధ భాగాలూ వేర్వేరు ప్రదేశాలలో పడి 18 శక్తి పీఠాలుగా మారిన విషయం మీకు విదితమే... � ఈ ప్రదేశంలో దేవి యొక్క పై దవడ ఇక్కడ పడిందట... ఈ క్షేత్రంలో తల్లిని యోగులంబ అని, యోగాంబ అని చివరికి జోగులాంబ గ స్తిరపడిందని ప్రతీతి..
బహమనీ సుల్తానుల దాడులలో (క్రీ. శ. 1480) పూర్వపు ఆలయం శిధిలమయిందట... వారి దాడిలో ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసారు... పూజారులు మాత్రం అమ్మ వారి విగ్రహాలను కాపాడ గలిగారు...� (చిత్రంలో దెబ్బతిన్న ఆలయకలశాన్ని చూపాను చూడండి) దేవి ఇక్కడ చండి ముండి (బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో) రూపంలో ఉంటుంది... బహమనీ సుల్తానులకు దొరకకుండా ఈ విగ్రహాలను పూజారులు జాగ్రత్తగా దాచారు...

దేశానికే పేరెన్నిక గల ఒక శక్తి పీఠం తిరిగి పునరుద్ధరణకు నోచుకోవడానికి పట్టిన సమయమేంతో తెలుసా... 525 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్తగా కట్టిన గుడిలో పునః ప్రతిష్ట చేసారు... ఇప్పటికీ దీనిలో ఒక దర్గా నడుస్తుంది... మత పెద్దలందరినీ ఒప్పించి... దర్గా ను ఒక చిన్న గదికి పరిమితం చేసారు...
ఈ విషయం విన్న నాకు చాల బాధ కలిగింది... కాని చంద్రబాబు ధన్య జీవి... ఆలయ పూజారి చంద్రబాబు తిరుమలలో హత్యాయత్నం నుండి తప్పించుకోటానికి తల్లి కృపే ప్రధాన కారణం అని చెప్పాడు....
ఈ క్షేత్రం తుంగభద్రా నది ఒడ్డున ఉంది... పూర్వం శ్రీశైలం ప్రాజెక్టు లో నీరు నిండితే ఈ ఆలయం మునిగి పోయేదట... దాదాపు ఊరు కూడా సగం మునిగి పోతుంది... నది ప్రవాహ ప్రభావం ఆలయం మీద పడకుండా పెద్ద గోడ కట్టారు...
ఇక్కడ అమ్మవారిది ఉగ్ర రూపం... అందుకే ఆ వేడిని తగ్గించటానికి చుట్టూ ఒక తటాకాన్ని నిర్మించారు...
ఇక్కడ బ్రహ్మ ప్రతిష్టించిన 9 ఆలయాలను నవబ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి...
అవి.. 1. తారక బ్రహ్మ ఆలయం
2. స్వర్గ బ్రహ్మ ఆలయం
3. పద్మ బ్రహ్మ ఆలయం
4. బాల బ్రహ్మ ఆలయం
5. విశ్వ బ్రహ్మ ఆలయం
6. గరుడ బ్రహ్మ ఆలయం
7.కుమార బ్రహ్మ ఆలయం
8.ఆర్క బ్రహ్మ ఆలయం
9. వీర బ్రహ్మ ఆలయం
ఈ ఆలయంలో చాల ఉపాలయాలు చాల ఉన్నాయి.. చాల విశాల ప్రాంగణం... ఈ ఆలయ శిల్పకళ చాల బావున్నాయి.. 2 కళ్ళు చాలవు... ఇంకా సూర్యనారాయణ స్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం ఉన్నాయి... వీటిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు..
No comments:
Post a Comment