పంచ లోహాలు అంటే ఏమిటి?
పంచ లోహాలు 5 అవి 1 బంగారము 2 వెండి 3 ఇత్తడి 4 రాగి 5 ఇనుము ఈ పంచ లోహాల వలన అనేక రకముల లాభాలు ఉన్నాయి అందులో బంగారం , వెండి మొదలగునవి ఆభరణములు గా ధరించుట కొరకు మరియు ఆస్తి రూపములో ఉంచుకోవడానికి ఉపయోగ పడుచున్నవి . అంతే కాకుండా ఈ రకమైన ఆభరణములు ధరించుట వలన శరీరములో తేజస్సు పెరుగుతుంది . పూర్వము ఆడపిల్లకు పెళ్ళిచేసి అత్తవారింటికి పంపేటప్పుడు ఇత్తడి , కంచు , రాగి సామాన్లు , వంట పాత్రలు , బిందెలు మొదలగు వస్తువులను సారె పెట్టేవారు .
రాగి పాత్రలో గానీ రాగి బిందెలో గానీ ఉంచిన నీటిని త్రాగడం వలన ఆరోగ్యము చేకూరుతుంది .దీనిని గురించి ఈ దిగువ తెలిపిన లింకులో చక్కగా వివరించారు ." తెలుగు విజ్ఞాన వినోదం " లో వివరించిన సమాచారమును ఈ దిగువన చదవండి .
మనం నీరు త్రాగేముందు ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు.
దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని
తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల
బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట
మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం
కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న
సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే!
భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.
ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు.
ఈమధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.
కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి

No comments:
Post a Comment