ఆయువు , ధనము , ఇంటిగుట్టు , మంత్రం , ఔషధం ,స్త్రీ సంబంధం
, దానం , మానం మొదలగు విషయములను పైకి చెప్పకూడదు ..
విడచిన బాణం గడచిన క్షణం , ఒలికిన పాలు వీటిని గూర్చి
చింతించుట వలన ప్రయోజనం ఉండదు .
బ్రహ్మచర్యమును ఆచరించని వాడు సమాజమునకు మార్గదర్శి కాలేడు
.
ఆశకు దాసులైతే అందరికి దాసులౌతారు
ఆశయే దాసీ అయితే ( ఆశలు అదుపులో ఉంటె ) లోకమే దాసోహం
అవుతుంది .
పిలవని పేరంటానికి వెళ్ళకూడదు .
యజ్న యాగాదులు దైవ సంబంధ కార్యాలకు పిలవక పోయినా వెళ్ళవచ్చు
రుద్రాక్ష మాలతో జపం చేస్తే ధర్మార్ధ మోక్షాలు కలుగుతాయి
స్ఫటిక మాలతో జపం చేస్తే సర్వాభీష్టములు సిద్దించును
పగడము మాలా ధారణ వలన విద్యాభివృద్ధి , వశీకరణము కలుగును
యంత్రము ఇచ్చాశక్తి చిహ్నము . మంత్రము జ్ఞాన శక్తికి సంకేతం తంత్రము
క్రియాశక్తికి మూలము
.
రుద్రాక్షలను ధరించుట వలన గుండెదడ , మధుమేహము వంటి రోగములు
తగ్గును
No comments:
Post a Comment